దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

0
846

భారతదేశంలో గత 24 గంటల్లో కొత్త‌గా 10,929 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. అదే సమయంలో క‌రోనా వ‌ల్ల‌ 392 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో క‌రోనా నుంచి 12,509 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 1,46,950 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా నుంచి మొత్తం 3,37,37,468 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 4,60,265కు పెరిగింది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,07,92,19,546 డోసుల వ్యాక్సిన్ వినియోగించారు.

తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 33,226 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 151 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 45 కొత్త కేసులు నమోదు కాగా, వనపర్తి, వికారాబాద్, సంగారెడ్డి, నిర్మల్, నారాయణపేట, మెదక్, జోగులాంబ గద్వాల, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 190 మంది కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,72,203 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,64,402 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,838 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,963కి పెరిగింది.

ఏపీలో గడచిన 24 గంటల్లో 23,824 కరోనా పరీక్షలు నిర్వహించగా, 150 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 28 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 217 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,67,706 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,49,555 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,760 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,391కి పెరిగింది.