More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్.. ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఇదే

    భారతదేశంలో గత 24 గంటల్లో కొత్తగా దేశంలో 6,317 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 6,906 మంది బాధితులు కోలుకున్నారని, 318 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. తాజా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,47,58,481కు చేరుకుంది. ఇందులో 3,42,01,966 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 78,190 యాక్టివ్‌ కేసులున్నాయని అధికారులు తెలిపారు. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 213కు పెరిగిందని ఆరోగ్యశాఖ తెలిపింది. ఢిల్లీలో 57, మహారాష్ట్రలో 54, తెలంగాణలో 24, కర్ణాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్‌లో 14, కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో 2, ఒడిశాలో 2, యూపీలో 2, ఏపీ, ఛండీగఢ్‌, లద్దాఖ్‌, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కొక్కటి చొప్పున ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్లు వివరించింది. ఇందులో ఇప్పటి వరకు 90 మంది కోలుకున్నారని తెలిపింది.

    తెలంగాణలో గడచిన 24 గంటల్లో 39,919 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 172 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 86 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో 188 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,79,892 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,72,251 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,625 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,016కి పెరిగింది.

    ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 27,233 కరోనా శాంపిల్స్ పరీక్షించగా 95 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 26 కొత్త కేసులు నమోదు అయ్యాయి. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 179 మంది కరోనా నుంచి కోలుకోగా, కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,75,974 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 20,60,061 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,432 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,481కి పెరిగింది.

    Trending Stories

    Related Stories