National

దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

భారతదేశంలో గత 24 గంటల్లో 40,134 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అదే సమయంలో 36,946 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,16,95,958కు చేరింది.మరణాల విషయానికొస్తే నిన్న‌ 422 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలో మృతుల సంఖ్య మొత్తం 4,24,773కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,08,57,467 మంది కోలుకున్నారు. 4,13,718 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

01-08-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 85,856 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,287 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 410 కొత్త కేసులు నమోదు కాగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 28 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 2,430 మంది కరోనా నుంచి కోలుకోగా, 18 మంది మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 13,395కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,68,462 పాజిటివ్ కేసులు నమోదు కాగా 19,34,048 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 21,019 మంది చికిత్స పొందుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 83,763 కరోనా టెస్టులు నిర్వహించగా, 455 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 648 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,45,406 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,32,728 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 8,873 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,805కి చేరింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 × 1 =

Back to top button