More

  చైనా లోని వుహాన్ లో మళ్లీ కరోనా కలకలం.. డెల్టా వేరియంట్ కేసులు

  చైనా లోని వుహాన్.. ఈ పేరు చెబితే చాలు కరోనాను పుట్టించింది అక్కడి ఉన్న వైరాలజీ ల్యాబ్ లోనే కదా అని ప్రతి ఒక్కరూ అంటుంటారు. వుహాన్ లో కరోనా కేసులు ఒకప్పుడు అధిక సంఖ్యలో నమోదయ్యాయి. కరోనా మహమ్మారి అక్కడి నుండి ఇతర దేశాలకు కూడా పాకి.. చివరకు ప్రపంచం మొత్తాన్ని ఎంతగా ఇబ్బంది పెడుతోందో తెలిసిందే..! ఓ వైపు ప్రపంచ దేశాల్లో వేళల్లో ప్రతి రోజూ మరణాలు సంభవిస్తూ ఉంటే.. చైనాలో మాత్రం ఎటువంటి నిబంధనలు లేకుండా బ్రతికారు. వైరస్ కు ముందుగానే వ్యాక్సిన్లు తయారు చేసుకుని ఉన్నారేమోననే అనుమానాలు కూడా కలిగాయి.

  ఇప్పుడు అదే వుహాన్ లో మళ్లీ కరోనా వైరస్ కలకలం మొదలైంది. వుహాన్ నగరంలో ఇప్పుడు వైరస్ కేసులు మళ్లీ ఎక్కువవుతున్నాయి. ఆ నగరంలోని 1.1 కోట్ల జనాభాకు కరోనా పరీక్షలను నిర్వహించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కరోనాను గుర్తించేందుకు న్యూక్లిక్ యాసిడ్ పరీక్షను ప్రారంభిస్తున్నట్టు సీనియర్ అధికారులు తెలిపారు. కరోనా వెలుగులోకి వచ్చిన వెంటనే వుహాన్ లో కఠిన ఆంక్షలను అమలు చేశారు. అప్పట్లో అక్కడ వైరస్ అదుపులోకి వచ్చింది. ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు అక్కడ ఏడు కేసులు బయటపడ్డాయి. వలస కార్మికుల్లో ఆ కేసులను గుర్తించారట..! చైనా మొత్తం లోనూ 61 మందికి కరోనా సోకింది.ప్రస్తుతం చైనాలో డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందుతూ ఉండడంతో దాదాపు అన్ని నగరాల్లో ఆంక్షలను మళ్లీ కఠినతరం చేశారు. ప్రజలు ఇళ్ల వద్దనే ఉండాలని ఆంక్షలు విధించారు. ప్రభుత్వం రవాణా సదుపాయాలను తగ్గించింది. ఇదే సమయంలో కరోనా పరీక్షలను కూడా పెద్ద స్థాయిలో నిర్వహిస్తోంది. చైనాలో ఇప్పటి వరకు 93,193 కేసులు నమోదు కాగా 4,636 మంది మృతి చెందారని అధికారిక లెక్కలు చెబుతూ ఉన్నారు. కానీ పెద్ద ఎత్తున మరణాలను దాచారనే విమర్శలు కూడా ఉన్నాయి. చైనా ఎన్నో విషయాలను బయట పెట్టలేదని విమర్శలు వచ్చాయి. చైనా చేసిన తప్పుకు ప్రపంచం మొత్తం అనుభవిస్తోంది. మరో వైపు చైనా కరోనా వైరస్ ను జీవాయుధంగా ప్రపంచం మీదకు పరీక్షించిందనే అనుమానాలు కూడా ఉన్నాయి.

  రిపబ్లికన్ నేతల రిపోర్టులో కూడా అదే:

  కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచే లీక్ అయిందని అమెరికాకు చెందిన రిపబ్లికన్ పార్టీ నేతలు ప్రకటించారు. వుహాన్ ఇనిస్టిట్యూట్ఆఫ్​వైరాలజీలో కరోనా వైరస్ లను మనుషులకు సోకేలా మాడిఫై చేసే ప్రయోగాలు జరిగాయని రిపబ్లికన్ పార్టీ నేతలు స్పష్టం చేశారు. కచ్చితమైన ఆధారాలు కూడా ఉన్నాయని ఈ మేరకు వారు రిపోర్టులో తెలిపారు. ప్రతినిధుల సభ రిపబ్లికన్ సభ్యుడు, హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ చీఫ్ మైక్ మెక్ కౌల్ ఈ రిపోర్టును సోమవారం విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా 44 లక్షల మందిని బలితీసుకున్న కరోనా మహమ్మారి పుట్టుకపై ద్వైపాక్షిక విచారణ జరగాల్సిందేనని రిపోర్టులో డిమాండ్ చేశారు. వుహాన్ లోని జంతువుల మార్కెట్ నుంచి వైరస్ వ్యాపించిందన్న వాదనను పూర్తిగా తిరస్కరించాల్సిన సమయం వచ్చిందని రిపోర్టు తెలిపింది.

  Trending Stories

  Related Stories