National

కేరళ బోర్డర్ ను మూసేయండి.. బక్రీద్ కోసం నిబంధనలు సడలించిన ప్రభుత్వంపై విమర్శలు

కరోనాను కట్టడి చేయాలని ఎన్నో రాష్ట్రాలు చాలా కష్టపడుతూ ఉన్నాయి. కానీ కేరళలో మాత్రం ఇటీవల బక్రీద్ కోసం కొన్ని రోజుల పాటూ సడలింపులను ఇచ్చారు. సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలను జారీ చేయలేదు. అప్పుడు నింబంధనలు పట్టించుకోకపోవడమే ఇప్పుడు కేరళలో కరోనా కేసులు భారీగా పెరిగిపోవడానికి కారణం. దేశంలో మొత్తం ట్యాలీలో కేరళ నుంచే కేసులు ఎక్కువగా ఉన్నాయనే విషయం మర్చిపోరాదు. 25 కోట్లు జనాభా ఉన్న యూపీలో కేసులు పెరిగినప్పుడు లొల్లి చేసిన లుటియెన్స్ మీడియా.. కేరళలో పెరిగిపోతున్నకొవిడ్ కేసులపై మౌనంగా ఎందుకు ఉంది? ఇది కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం వైఫల్యం కాదా? అంటూ ప్రజలు కడిగిపారేస్తూ ఉన్నారు.

ఒక్క ప్రాంతంలో కరోనా కేసులు పెరిగితే చాలు దేశం మొత్తం కరోనా పెరుగుదలను అనుభవించకతప్పదని పలువురు నిపుణులు ఇప్పటికే చెప్పారు. కానీ కేరళ ప్రభుత్వం మాత్రం వారి సూచనలను కనీసం పట్టించుకోలేదు. ఈశాన్య రాష్ట్రాలతోపాటు కేరళలో వైరస్‌ వ్యాప్తి విస్తృతంగా ఉండడంపై కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. కేరళలో నిత్యం 10వేలకు పైగా కేసులు బయటపడుతుండడంతో అక్కడ పరిస్థితులు చేజారిపోయినట్లు కనిపిస్తున్నాయని స్పష్టంగా అర్థమవుతోంది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో వైరస్‌ ఉద్ధృతి అదుపులోకి వచ్చినప్పటికీ కేరళలో మాత్రం నిత్యం 10వేలకుపైగా కొత్త కేసులు బయటపడుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో ప్రస్తుతం పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గినప్పటికీ కేరళలో ఇంకా 10శాతానికిపైగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో నమోదవుతున్న రోజువారీ కేసుల్లో 40శాతం ఒక్క కేరళలోనే ఉంటున్నాయి. గడిచిన 24గంటల్లో అత్యధికంగా 22వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదుకావడం కలవరపెడుతోంది. బక్రీద్ సమయంలో కేరళ ప్రభుత్వం ఆంక్షలను ఎత్తేసి చాలా పెద్ద తప్పు చేసిందని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఐసీఎంఆర్‌ జాతీయ స్థాయిలో నిర్వహించిన సీరో సర్వేలో దేశవ్యాప్తంగా సరాసరిగా 67.6శాతం మందిలో యాంటీబాడీలు ఉంటే, కేరళలో మాత్రం 42.7శాతం మాత్రమే ఉన్నాయి. మరో 48శాతం కేరళ ప్రజలకు వైరస్‌ ముప్పు పొంచివుందనే అర్థమని సంకేతాలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కొవిడ్‌ పాజిటివిటీ రేటు 5 శాతానికన్నా తక్కువగా నమోదవుతున్నప్పటికీ కేరళలో మాత్రం గడిచిన 6వారాలుగా 10 నుంచి 12శాతం రికార్డవుతోంది.

రాష్ట్రంలో భారీ స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుపుతుండడంతోనే పాజిటివ్‌ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయని అక్కడి నాయకులు చెబుతున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ ఒప్పుకున్నారు. ఏప్రిల్‌ మధ్య కాలంలో సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైందని.. మే 12న అత్యధికంగా 43వేల కేసులతో గరిష్ఠానికి చేరుకుందని చెప్పారు. అనంతరం తగ్గుతుందని భావించినప్పటికీ వైరస్‌ తీవ్రత ఇంకా కొనసాగుతోందని.. ఈ పాజిటివిటీ గ్రాఫ్‌ను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని వీణా జార్జ్‌ అంటున్నారు.

బ‌క్రీద్ అంటూ కేరళ ప్రభుత్వం అక్క‌డ ఫుల్ రిలాక్సేష‌న్ ఇచ్చింది. ఆ సమయంలో జరిగిన షాపింగ్ లు, విచ్చలవిడిగా తిరగడం వంటి ప్ర‌భావ‌మే ఇప్పుడు కేర‌ళ‌లో కేసుల సంఖ్య పెరిగేందుకు కార‌ణ‌మవుతోంది. ఇప్పుడు దేశం మొత్తాన్ని థర్డ్ వేవ్ ప్రమాదంలో నెడుతోంది. ఈద్-అల్-అధా వేడుకలు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా కేరళలో కోవిడ్ -19 సూపర్-స్ప్రెడర్ ఈవెంట్ లుగా మారాయి. కేరళ రాష్ట్రంలో మరోసారి 22,000 కన్నా ఎక్కువ కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు అయ్యాయి.

మంగళవారం నాడు కమ్యూనిస్ట్ పాలిత కేరళలో 22,129 కేసులు నమోదయ్యాయి. కేరళలో ఒకే రోజులో ఇరవై వేలకు పైగా కేసులు నమోదవడం మే తరువాత ఇదే మొదటిసారి. కేరళలో కోవిడ్ -19 మహమ్మారి ఆందోళన కలిగించే అంశంగా మారింది. కేరళలో ఇంకా 1,45,367 కి పైగా యాక్టివ్ కేసులు ఉండడం ఆందోళన కలిగించే అంశం. కేరళలో కోవిడ్ -19 కేసులు అకస్మాత్తుగా పెరగడానికి ఒక ప్రధాన కారణం ఈద్-అల్-అధా వేడుకలకు పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆంక్షలను సడలించడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

కేరళలో మహమ్మారి వ్యాపించడం వెనుక రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత ఉన్నప్పటికీ, పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం ముస్లిం సమాజం యొక్క ఒత్తిడికి లోనయ్యింది. బక్రీద్ జరుపుకునేందుకు మూడు రోజులు లాక్డౌన్ ఆంక్షలను ఎత్తివేసింది. జూలై 18 నుండి జూలై 21 వరకు కేరళ ప్రభుత్వం బక్రీద్ పండుగకు సడలింపు ప్రకటించింది. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి మరీ కేరళ ప్రభుత్వం బక్రీద్ పండుగకు ఆంక్షలను ఎత్తివేయడం శోచనీయమని పలువురు నిపుణులు హెచ్చరించారు. ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.. ఇకనైనా కరోనా కట్టడికి కేరళ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటుందో లేదో..!

Related Articles

Leave a Reply

Your email address will not be published.

4 + fourteen =

Back to top button