పెళ్లయిన వెంటనే ఆర్మీ ఎదుట కొత్త జంట..! ఇంతకీ వాళ్లేం చేశారో తెలిస్తే…..

0
816

పెళ్ళికి ఎవరైనా స్నేహితులు, బంధువులు, కొలీగ్స్‎ను పిలుస్తారు. కొంచెం డబ్బున్నవాళ్లయితే, చుట్టుపక్కల వాళ్లను, పరిచయస్తులను కూడా ఆహ్వానిస్తారు. కానీ, ఆ జంట భిన్నంగా ఆలోచించింది. ఎవరూ ఊహించని రీతిలో.. ఇప్పటి వరకు ఎవరూ ఆహ్వానించని వ్యక్తులను తమ పెళ్లికి పిలిచి సంచలనం సృష్టించింది. అయితే, వారి వినూత్న ఆలోచనే.. పెళ్లి కాగానే వారిని ఆర్మీ ముందు హాజరయ్యేలా చేసింది..? ఇంతకీ, ఆ జంట తమ పెళ్లికి ఆహ్వానించింది ఎవర్ని..? పెళ్లయిన వెంటనే నవ దంపతులిద్దరూ ఆర్మీ ముంగింట ఎందుకు ప్రత్యక్ష్యం కావాల్సి వచ్చింది..? ఆ వివరాలేంటో తెలుసుకుందాం. అంతకంటే ముందు నేషనలిస్ట్ హబ్ వీక్షకులకు చిన్న విన్నపం. మా వీడియోలను లక్షల్లో ఆదరిస్తున్న అభిమానులకు కృతజ్ఙతలు. మా వీడియోలకు విపరీతమైన వ్యూస్ వస్తున్నాయి. కానీ, చాలామంది సబ్ స్క్రయిబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. నేషనలిస్ట్ హబ్ తో పాటు.. అన్ని గ్రూపాఫ్ ఛానెల్స్ ను సబ్ స్క్రయిబ్ చేసుకుని మమ్మల్ని మరింతగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం. అంతేకాదు, ఈ వీడియోను లైక్ చేయండి.. పదిమందికీ షేర్ చేయండి.

కేరళ రాజధాని తిరువనంతపురంలో.. బ్యాంకు ఉద్యోగి రాహుల్, ఐటీ ఉద్యోగి కార్తీక నవంబర్ 10న పెళ్లి చేసుకున్నారు. మేళతాళాలు, వేద మంత్రాల సాక్షిగా.. పెద్దల ఆశీర్వాదంతో వివాహబంధంలో అడుగుపెట్టారు. అయితే, తమ పెళ్లికి బంధువులను, స్నేహితులను కొలీగ్స్ ను పిలిచిన రాహుల్, కార్తీక.. అరుదైన వ్యక్తులను కూడా ఆహ్వానించి సంచలనం సృష్టించారు. ఇంతకీ వారు ఆహ్వానించింది ఎవర్నో తెలుసా..? మన వీర జవాన్లను. ఎస్.. మీరు విన్నది నిజమే. అందరికంటూ వినూత్నంగా ఆలోచించిన రాహుల్, కార్తీక.. తమ పెళ్లికి భారత జవాన్లను ఆహ్వానించారు. తమ స్వహస్తాలతో ఆర్మీకి ఉత్తరం రాశారు. ‘డియర్ హీరోస్’ అని సంబోధిస్తూ.. రాహుల్, కార్తీక్ అనబడమే మేము.. నవంబర్ 10న పెళ్లి చేసుకుంటున్నామని.. తప్పకుండా వచ్చి ఆశీర్వదించాలని కోరారు. అంతేకాదు, వారు దేశానికి చేస్తున్న సేవలను కొనియాడారు. దేశం పట్ల దేశభక్తి, ప్రేమ కలిగి ఉన్న ప్రతి సైనికుడికీ కృతజ్ఞతలు తెలిపారు. దేశ సరిహద్దుల దగ్గర సైన్యం చేస్తున్న త్యాగాల వల్లే తాము దేశంలో సురక్షితంగా ఉంటున్నామని ఉత్తరంలో రాశారు. తమ పెళ్ళికి భారత సైనికులందరూ తప్పకుండా హాజరై తమను ఆశీర్వదించాలనీ లేఖలో కోరారు.

ప్రజలందరి హృదయాలను కదిలించే ఈ వినూత్న వివాహ శుభలేఖ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. INDIAN ARMY, Together for love అనే హ్యాష్ ట్యాగ్ లతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ లేఖ కాస్తా ఆర్మీ ఉన్నతాధికారుల దృష్టిలో పడటంతో వారు కూడా స్పందించారు. భారత ఆర్మీ తన ఇన్‎స్టాగ్రామ్ లో ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఇండియన్ ఆర్మీ ఏడీజీపీఐ’ ఇన్ స్టా ఖాతా నుంచి నవదంపతులకు శుఖాకాంక్షలు అందజేశారు. ఈ జంట సుఖ సంతోషాలతో ఉండాలని దీవించారు. అంతేకాదు, నవదంపతులను కేరళలోని పాంగోడ్ మిలిటరీ స్టేషన్ కు పిలిపించిన.. స్టేషన్ కమాండర్ బ్రిగేడియర్ లలిత్ శర్మ.. కొత్త జంటకు పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించారు. వారికి ఆర్మీ తరపున ఓ జ్ఞాపికను కూడా అందజేశారు.

నవ దంపతుల వినూత్న ఆలోచనకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. దేశ రక్షణలో అహర్నిశలూ కష్టపడుతున్న భారత సైన్యం కోసం.. ఆలోచించడం శుభ పరిణామం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దేశంలోని ప్రజలందరూ ఈ విధంగా ఆలోచించి ఆర్మీ కోసం తమవంతు సహాయం అందించాలని పలువురు కోరుతున్నారు. సోషల్ మీడియాలో ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. జీవితాంత సుఖసంతోషాలతో జీవించాలని నెటిజన్లు దీవిస్తున్నారు. దేశంలోని ప్రతిఒక్కరూ కూడా సైన్యంపై ఇదేవిధమైన ప్రేమను చూపాలని కోరుకుంటున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

12 − eleven =