ప్రస్తుతం వివిధ దేశాలు విధిస్తోన్న ఆంక్షల గురించి చైనా స్పందిస్తూ తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలే అని వెల్లడించింది. అంతే కాదు.. యూరోపియన్ యూనియన్ కి చెందిన నాలుగు సంస్థలు, పది మంది వ్యక్తులపై ఆంక్షలు విధించింది. వీరు చైనా సార్వభౌమత్వానికి నష్టం కలిగిస్తున్నారని వెల్లడించింది. ఈ సంస్థలు లేదా వ్యక్తులు చైనాలోకి అడుగుపెట్టేందుకు అర్హత లేదు. చైనా దేశస్థులతో ఎలాంటి వ్యాపార, వాణిజ్య, వ్యక్తిగత సంబంధాలు కొనసాగించేందుకు వారికి అర్హత లేదని వెల్లడించింది.
చైనా మరియు ఆ దేశాధికారులపై ఆంక్షల వెల్లువ..! పలు దేశాల ఆగ్రహానికి కారణం ఏంటంటే..?
చైనాలోని షిన్ జియాంగ్ ప్రావిన్స్ లో వీగర్ ముస్లింలపై క్యాంపుల పేరుతో బంధించి బానిసల్లా పనిచేయించుకుంటున్నారని, లైంగిక హింస వంటివి అక్కడ సహజంగా మారిపోయాయని వివిధ న్యూస్ ఏజెన్సీలు తాజాగా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో చాలా దేశాలు చైనాపై, ఆ దేశ అధికారులపై ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షల్లో ట్రావెల్ బ్యాన్, ఆస్తుల జప్తు, మానవ హక్కుల ఉల్లంఘనకు కారణమయ్యారన్న ఆరోపణలున్న సీనియర్ అధికారులను టార్గెట్ చేయడం వంటివన్నీ ఉన్నాయి. షిన్ జియాంగ్ ప్రావిన్స్ లో ముస్లింలపై దాడి ప్రపంచంలోనే అత్యంత హీనమైన మానవ హక్కుల ఉల్లంఘన అంటూ యూకే వెల్లడించింది. 1989 నుంచి యూరోపియన్ యూనియన్ చైనాపై కొత్త ఆంక్షలను విధించలేదు. కానీ ఇప్పుడు అమెరికా, యూరోపియన్ యూనియన్, కెనడా, యూకే వంటి దేశాలన్నీ కలిసి చైనా పై ఆంక్షలు విధించాయి.
వీగర్ల జనాభా తగ్గించేందుకు.. ఆ తెగను పూర్తిగా అంతరించిపోయేలా చేసేందుకు చైనా వారిపై కుట్రపూరిత చర్యలను కొనసాగిస్తోందని ఎప్పటినుంచో అమెరికా ఆరోపిస్తోంది. వీగర్లను చదివించి వారిని తీవ్రవాదం వైపు ఆకర్షితులవ్వకుండా చేస్తున్నామని చైనా క్యాంపులు నిర్వహిస్తోన్నా ఆ క్యాంపుల్లో జరిగేది వేరని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. బలవంతంగా వీగర్ మహిళలందరికీ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేస్తూ వారి జనాభాను తగ్గించే ప్రయత్నం చేస్తోంది చైనా. 2018 లో షిన్ జియాంగ్ ప్రాంతాన్ని సందర్శించిన ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం కూడా తీవ్రవాద వ్యతిరేక క్యాంపుల్లో మిలియన్ కి పైగా వీగర్లు ఉంటున్నట్లు తెలిపింది. అయితే 2020 లో ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్సిట్యూట్ చైనాకి వెళ్లి అంతకు 40 శాతం ఎక్కువ మంది అక్కడ ఉంటున్నట్లు వెల్లడించింది. ఈ ప్రాంతాలు జైళ్ల కంటే అధ్వానంగా ఉంటున్నాయని, ఇక్కడ చిన్న తప్పు చేసిన పెద్ద శిక్షలు విధిస్తున్నారని ఇక్కడి నుంచి పారిపోయిన వారు వెల్లడిస్తున్నారు. నిర్భంధ క్యాంపుల్లో శారీరక, మానసిక, లైంగిక హింస జరుగుతోందని చాలామంది తమ అనుభవాలు వెల్లడించారు.
ప్రస్తుతం వివిధ దేశాలు విధిస్తోన్న ఆంక్షల గురించి చైనా స్పందిస్తూ తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలే అని వెల్లడించింది. అంతే కాదు.. యూరోపియన్ యూనియన్ కి చెందిన నాలుగు సంస్థలు, పది మంది వ్యక్తులపై ఆంక్షలు విధించింది. వీరు చైనా సార్వభౌమత్వానికి నష్టం కలిగిస్తున్నారని వెల్లడించింది. ఈ సంస్థలు లేదా వ్యక్తులు చైనాలోకి అడుగుపెట్టేందుకు అర్హత లేదు. చైనా దేశస్థులతో ఎలాంటి వ్యాపార, వాణిజ్య, వ్యక్తిగత సంబంధాలు కొనసాగించేందుకు వారికి అర్హత లేదని వెల్లడించింది.
అయితే వరుస ఆరోపణలు వస్తున్నా చైనా మాత్రం తీవ్రవాదాన్ని అణచివేయడానికి వియ్ ఘర్ లకు చదువు చెప్పిస్తున్నామనే వెల్లడిస్తోంది. తమకు స్వంతత్ర రాష్ట్రం కావాలంటూ ఈ వీగర్ ముస్లింలంతా హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని బాంబులు వేయడం, ప్రజల్లో అశాంతి కోసం విధ్వంసం చేయడం వంటివి చేస్తున్నారని.. వారికి మాత్రమే శిక్షలు విధిస్తున్నామని వెల్లడిస్తోంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల గురించి వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలే అంటోంది చైనా.
అయితే ప్రపంచ దేశాలన్నీ ఏకరువు పెట్టి నినదిస్తున్నా చైనా మాత్రం తన విధానాలు మార్చుకునే ఛాన్స్ లేదని స్పష్టం అవుతుంది. అక్కడి మీడియాకు స్వేచ్ఛ లేకుండానే ఇన్నిన్ని నిజాలు బయటకు తెలుస్తున్నాయంటే.. మన దేశం మాదిరి మీడియాకు విశృంఖల స్వేచ్ఛ ఉండివుంటే ఈ పాటికి చైనాకు పోస్ట్ మార్టం జరిగిపోయిదనేది వాస్తవం. ఏం చేస్తాం.. అక్కడి కమ్యూనిస్ట్ నియంతల చేతిలో ఆ దేశం ఉన్నన్నాల్లూ ఇటువంటి వార్తలు మనం వింటూనే ఉండాలేమో.