More

  భారతదేశంలో కరోనా కేసుల అప్డేట్స్

  భారతదేశంలో గత 24 గంటల్లో 94,052 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అదే సమయంలో 1,51,367 మంది కోలుకున్నారు. భారతదేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,91,83,121కు చేరింది. మరో 6,148 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,59,676కు పెరిగింది. ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,76,55,493 మంది కోలుకున్నారు. 11,67,952 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

  దేశవ్యాప్తంగా బుధవారం నాటికి 24 కోట్ల కరోనా టీకా డోసులకు పైగా పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 18-44 ఏళ్ల కేటగిరీలో 3,38,08,845 మందికి తొలి డోసు, 4,05,114 మందికి రెండో డోసు అందజేసినట్లు ఆరోగ్య శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. మొత్తం 24,24,79,167 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు. వీరిలో హెల్త్‌కేర్ వర్కర్లు 1,00,12,624 మంది తొలి డోసు, 69,11,311 మంది రెండో డోసు తీసుకున్నారు. ఫ్రంట్‌లైన్ వర్కర్లలో 1,64,71,228 మంది తొలి డోసు, 87,51,277 మంది రెండో డోసు తీసుకున్నారు. 45-60 ఏళ్ల కేటగిరీలో 7,33,23,267 మంది లబ్ధిదారులు తొలి డోసు.. 1,16,22,718 మంది రెండో డోసు టీకా తీసుకున్నారు. 60 ఏళ్లు పైబడిన కేటగిరీలో 6,16,38,580 మంది లబ్ధిదారులు తొలి డోసు, 1,95,34,203 లబ్ధిదారులు రెండో డోసు వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

  09-06-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 93,511 మందికి పరీక్షలు నిర్వహించగా.. 8,766 కేసులు వెలుగుచూశాయి. 67 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 17,79,773కు చేరాయి. మరణాల సంఖ్య 11,696కు చేరుకుందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 12,292 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 16,64,082కు పెరిగింది. రాష్ట్రంలో ఇంకా 1,03,995 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

  తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,29,896 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,813 కేసులు వెలుగు చూడగా.. 17 మంది కరోనాతో కన్నుమూసినట్టు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 5,96,813కు పెరిగింది. ఇప్పటి వరకు మొత్తం 3,426 మంది చనిపోయారు.1,801 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఇంకా 24,301 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 180 కేసులు నమోదు కాగా, జీహెచ్ఎంసీ పరిధిలో 179 కేసులు వెలుగుచూశాయి.

  Related Stories