కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో కష్టపడుతూ ఉన్నాయి. కానీ కొందరి కారణంగా కరోనా కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. కరోనా కేసులు అత్యధికంగా నమోదైన రాష్ట్రం మహారాష్ట్ర కూడా..! ముంబైలో లాక్ డౌన్ నిబంధనలను పక్కన పెట్టి మరీ నమాజ్ కు హాజరయ్యారు. 50-60 మందిపై ముంబై పోలీసులు కేసులు నమోదు చేశారు.
మహీమ్ శ్మశానవాటికకు సమీపంలో ఎంతో గోప్యంగా మే 14 రోజున నమాజ్ చేస్తూ ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా పెద్ద సంఖ్యలో నమాజ్ కు హాజరయ్యారు. లాక్ డౌన్ సమయంలో ప్రార్థనా మందిరాలను మూసి వేయడమే కాకుండా.. ఇలాంటి చర్యలకు ఆస్కారం లేదని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. అయినా కూడా కొందరు కనీసం వినిపించుకోలేదు. పోలీసులు స్పాట్ కు చేరుకొని 50-60 మందిని అదుపులోకి తీసుకున్నారు. మహీమ్ పోలీసు స్టేషన్ పరిధిలో వీరందరిపై కేసులు నమోదు చేశారు. మహీమ్ శ్మశానవాటిక మేనేజ్మెంట్ పై కూడా కేసులను నమోదు చేశారు. సీనియర్ పోలీసు ఆఫీసర్ వికాస్ షిండే ఈ ఘటనపై మాట్లాడుతూ 60 మందికి పైగా నమాజ్ లో పాల్గొన్నారని.. పోలీసులకు సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకొని.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని అన్నారు. వారిపై కేసు కూడా పెట్టామని అన్నారు.
రంజాన్ సందర్భంగా రాజస్థాన్ లోని ఓ మసీదులో పెద్ద ఎత్తున జనం ఉండడాన్ని చూసిన పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. రాజస్థాన్ రాష్ట్రం దుంగార్ పూర్ లోని స్థానిక మసీదులో కరోనా నియమ నిబంధనలను ఉల్లంఘించి వందల సంఖ్యలో నమాజ్ కు హాజరు అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ మసీదు దగ్గరకు చేరుకుని లాఠీ ఛార్జ్ చేశారు.