National

ముఖ్యమంత్రి కాన్వాయ్ పై రాళ్ల దాడి

బీహార్ లో మళ్లీ రౌడీల రాజ్యం రాబోతోందా..? ఇటీవలి కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలే అందుకు సాక్ష్యం అని అంటున్నారు. తాజాగా బీహార్ ముఖ్యమంత్రి కాన్వాయ్ పై రాళ్ల దాడి చోటు చేసుకోవడంతో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలి. ఈ రాళ్లదాడి కారణంగా కాన్వాయ్‌లోని నాలుగు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆ కార్లలో సీఎం నితీశ్‌ కుమార్‌ లేరని తెలుస్తోంది. సీఎం నితీశ్‌ కుమార్‌ గయాలో పర్యటించాల్సి ఉంది. ఆయన గయా పట్టణానికి హెలీకాప్టర్‌లో చేరుకోనున్నారు. ఈనేపథ్యంలో సీఎం స్థానికకంగా తిరడంకోసం ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని కార్లు ఆదివారం సాయంత్రం గయకు బయలుదేరాయి. పట్నా-గయా హైవేపై రాజధాని శివార్లలో కొందరు ధర్నా చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం కాన్వాయ్‌ అటుగా రావడంతో కోపోద్రిక్తులైన యువకులు కార్లపై రాళ్లు విసిరారు. దీంతో కాన్వాయ్‌లోని నాలుగు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు 13 మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటనలో ఎవ్వరూ గాయపడలేదు.

Related Articles

Back to top button