More

  హిందుత్వంపై ముస్లిం దేశాల కుట్ర..! సోషల్ మీడియా వేదికగా విష ప్రచారం

  హిందువుల అన్నా.. హిందుత్వం అన్నా ముస్లింలకు, ముస్లిం దేశాలకు ఎక్కడలేని అక్కసు. ఎప్పుడెప్పుడు హిందువులను దెబ్బ కొట్టాలని కాచుకొని మరీ ఎదురుచూస్తుంటారు. అదును దొరికినప్పుడల్లా హిందువులపై కుట్రలు తెర తీస్తుంటారు. తాజాగా జరిగిన ఎన్‎సీఆర్ఐ అనే సంస్థ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

  సోషల్ మీడియా వేదికగా కొన్ని ముస్లిం దేశాలు కుట్రలు పన్నినట్లు వెల్లడైంది. భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక కుట్ర జరుగుతున్నట్లు తేలింది. ఇందుకు కొన్ని ముస్లిం దేశాలు అధికారిక వ్యవస్థలను ఉపయోగిస్తూ పెద్ద ఎత్తున నిధులు కూడా సమకూర్చుతున్నాయి. హిందువులను మూర్ఖులు, దోపిడీ దారులు, హత్యలు చేసే వారీగా చిత్రీకరించేందుకు, హిందూ ఆధ్యాత్మిక కేంద్రాలను, దేవాలయాలను కించపరిస్తూ పెద్ద ఎత్తున విష ప్రచారం జరుగుతోంది. నుపుర్ శర్మ వివాదం తర్వాత ముస్లిం దేశాలు ఈ కుట్రలు మరింత అధికం చేశాయి.

  భారతదేశంలో ముస్లిం వ్యతిరేక చర్యలకు పెద్ద ఎత్తున తెగబడుతున్నారని, హిందువులు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాల్లో మిగిలిన మైనార్టీలకు ఆస్తి, ప్రాణాలకు భద్రత లేకుండా పోతోందన్న అసత్య ప్రచారం చేస్తున్నారు. విదేశాల్లో ఉంటున్న హిందువులపై కూడా విషం కక్కుతూ ఆయా దేశాల్లో ఉంటున్న శ్వేత వర్ణీయులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారి ద్వారా హిందువులపై దాడులు చేయించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. హిందూ వ్యతిరేక నినాదాల మీమ్​లు తయారు చేయించడం, ప్రచారం చేయడం కోసం పెద్ద పెద్ద సంస్థలతో పెద్ద మొత్తంతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటున్నారు. కొన్ని దేశాల్లో దీని కోసం‘డాట్​బస్టర్స్’ అంటూ సంస్థలు కూడా ఏర్పాటయ్యాయి. సోషల్ ​మీడియా ద్వారా పెద్ద ఎత్తున హిందూ వ్యతిరేక అసత్య ప్రచారం జరుగుతోందని కొందరి రీసెర్చ్ లోనూ వెల్లడైంది. హిందువులను దుర్మార్గులుగా, అత్యాచారాలు చేసే వారిగా, మూకుమ్మడి హత్యలు చేసేవారిగా, అపరిశుభ్రంగా ఉండేవారిగా చిత్రీకరించే పద్ధతి. ఇదివరకు 4 చాన్​, టెలిగ్రామ్, గాబ్​లాంటి సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్స్​కే పరిమితమయ్యేది. తర్వాత కాలంలో ట్విట్టర్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా కూడా విపరీతంగా విష ప్రచారం జరుగుతున్నదని ఎన్​సీఆర్ఐ వెల్లడించింది. ఈ సంస్థ దాదాపు 10 లక్షల ట్వీట్లను పరిశీలించిన తర్వాత హిందువులపై ముప్పేట దాడికి రంగం సిద్ధం అవుతున్నదన్న విషయాన్ని స్పష్టం చేసింది.

  4 చాన్ సోషల్ మీడియాలో హిందువులను కించపరిచే విధంగా​‘పజీత్’​ అనే శబ్ద ప్రయోగం ప్రారంభమై నెమ్మదిగా మిగతా అన్ని చానళ్లకు పాకింది. హిందువులను కించపరిచే విధంగా వాడుకలో ఉన్న ఈ పదం కెనడాలో పుట్టింది. ముంబయిలో 26/11న జరిగిన దాడులను గొప్పగా చిత్రీకరిస్తూ, చనిపోయిన బాధిత హిందూ కుటుంబాలను వ్యంగ్యంగా చిత్రీకరిస్తూ.. ఎప్పటికైనా తమదే ఆధిపత్యం అంటూ అనేక తీవ్రవాద సంస్థలు, హిందూ వ్యతిరేక సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేశాయి. హిందువులు బలహీనులు, ఎందుకూ పనికిరాని వాళ్లు అని చిత్రీకరించడమే వీరి పని. అప్పటి వరకు కొన్ని సోషల్ మీడియాలకే మాత్రమే పరిమితమైన పజీత్ అన్న పదం 2021 నవంబర్​లో ప్రధాన మాధ్యమాల్లో తరచూ కనబడటం మొదలైంది. టిక్​టాక్ లో పజీత్ ​అన్న పదంలో ఉన్న వీడియోలను దాదాపు 20 లక్షల మంది చూశారు. 4 చాన్​ ఇతర మాధ్యమాల్లో ఉన్నట్లుగానే వీటిల్లో కూడా హిందూ వ్యతిరేక భావాలు నిండి ఉన్నాయి.

  భారత దేశంలో అశాంతిని రెచ్చగొట్టడానికి హిందూ –ముస్లింల మధ్య చిచ్చు పెట్టడానికి ఇరాన్​ అధికారిక సంస్థలు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాయి. మార్చి 2017లో భోపాల్ – ఉజ్జయిని ప్యాసెంజర్​ రైలులో ఇస్లామిక్ ​తీవ్రవాదులు జరిపిన బాంబు దాడిని హిందువులే చేశారంటూ అసత్య ప్రచారం చేయడానికి 4 సంస్థలు పెద్ద ఎత్తున పనిచేశాయి. ఆగస్టు 2017లో శ్రీనగర్ ​లోయలో బుర్హన్​వానీ చనిపోయిన సంఘటనను అడ్డం పెట్టుకొని కాశ్మీర్​లో మైనార్టీలను అణచివేస్తున్నారంటూ ప్రచారం చేశారు. 2018లో ఇరాన్​ అధ్యక్షుడు డాక్టర్​ హసన్​ రేహానీ భారత్ రాక సందర్భంగా భారత దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదంటూ ఇరాన్​ నుంచి 1053 ట్రోల్స్​ వచ్చాయి. ఇటీవలి కాలంలో హిందూ వ్యతిరేక, భారత వ్యతిరేక ప్రచారం సామాజిక మాధ్యమాల్లో ఉహించని వేగంతో జరుగుతున్నది. ప్రపంచ దేశాల్లో భారత పరువు ప్రతిష్టలను, హిందుత్వ సిద్ధాంతాలను అపహాస్యం పాలు చేయడానికి అంతర్గతంగా కుట్ర జరుగుతున్నది. ఇందుకు సామాజిక మాధ్యమాలు ఒక వేదికగా మారుతున్నాయి. వీటి ప్రభావానికి లోనైన వారు దేశంలోని కుహనా మేధావులు అగ్నికి ఆజ్యం పోసి సమాజంలో వైషమ్యాలను పెంచుతున్నారు. భారతీయులందరూ విజ్ఞతతో విదేశీ కుట్రను ఎదుర్కోవాల్సి ఉంటుంది. హిందుత్వంపై, భారత్​పై జరుగుతున్న ఈ ముప్పేట దాడిని ఎదుర్కొనకపోతే అవమానాలపాలు గాక తప్పదు.

  spot_img

  Trending Stories

  Related Stories