కాంగ్రెస్ టూల్ కిట్ వివాదం రోజు రోజుకు మరింత ముదురుతూనే ఉంది. తమ పార్టీకి చెందిన డాక్యుమెంట్స్ ను ఫోర్జరీ చేయడమేకాకుండా, వాటిని ట్విటర్ లో పోస్టు చేసి ఇబ్బందులకు గురి చేశారంటూ మే 18న కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఢిల్లీ పోలీసులు విచారణ ప్రారంభించి ట్విటర్ కు నోటిసులు జారీ చేసిన సమయంలో ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీ…, తన ఫిర్యాదును వాపస్ తీసుకుంటున్నట్లుగా ప్రకటించింది. అయితే అదే సమయంలో తమ పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్ గఢ్ లో మాత్రం ఈ కేసు విచారణను కొనసాగించాలని కోరుకుంటున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
తాము ఫిర్యాదు చేసినప్పుడు ఢిల్లీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, పైగా తమనే మరిన్ని వివరాలు సమర్పించాలని రోజు కోరుతున్నారని, ఈ పరిస్థితుల్లో ఢిల్లీ పోలీసుల చేత విచారణ జరిపించేకంటే కాంగ్రెస్ రూలింగ్ స్టేట్ లో విచారణ జరిపితే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే న్యాయం దొరుకుతుందనే నమ్మకంతోనే ఛత్తీస్ గఢ్ పోలీసుల చేత విచారణ జరిపిస్తున్నామని ఆ పార్టీ పైకి చెబుతున్నా అసలు కారణాలు వేరే ఉన్నాయనే వారు లేకపోలేదు.
అటు ఢిల్లీ పోలీసుల నుంచి టూల్ కిట్ ఫిర్యాదును ఉపసంహరించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రణదీప్ సుర్జేవాలా ట్విటర్ కు మరోక లేఖ రాశాడు. కేంద్రమంత్రులు సైతం టూల్ కిట్ వివాదంలో ట్విట్లు చేశారని.., వారిపై సైతం చర్యలు తీసుకోవాలని తన లేఖలో పేర్కొన్నారు. ఇంకా దీనిపై ఛత్తీస్ గఢ్ పోలీసులు విచారణ జరుపుతున్నారని, FIR సైతం నమోదు చేశారని సుర్జేవాలా ప్రస్తావించారు.కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కేంద్రమంత్రులు చేసిన ట్విట్లకు సైతం మ్యానిప్యులేటెడ్ మీడియాగా లేబుల్ వేయాలని సుర్జేవాలా కోరాడు.
మన దేశంలో ఏ సంస్థపైనా అయినా కంప్లైట్ ఇవ్వాలంటే పోలీసులకే ఇస్తాం. ఇది చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు. మరైతే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పోలీసులను కాదని.. ట్విటర్ కు కంప్లైట్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి. ట్విటర్ అనేది చట్టం ద్వారా ఏర్పడిన దేశీయ సంస్థ కూడా కాదు. అదోక అమెరికన్ కంపెనీ. సోషల్ మీడియా మాధ్యమం. ఇంకా చెప్పాలంటే అదో బహిరంగ వేదిక. ఢిల్లీ పోలీసులను కాదని… మన దేశంలో న్యాయ విచారణ ట్విటర్ ద్వారా జరగాలని కాంగ్రెస్ కోరుకోవడంలో దాని అంతర్యమేమిటి? భారత దేశ స్వాభిమానాన్ని, సార్వభౌమత్వాన్ని ఒక విదేశీ సామాజిక మాధ్యమం ముందు చలకన చేయడం కాదా?
ఇక మరో వైపు కాంగ్రెస్-ట్విట్టర్ మధ్య అనుబంధంపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
నిజానికి కాంగ్రెస్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత విచారణ ప్రారంభించిన ఢిల్లీ స్పెషల్ సెల్ టీమ్ ట్విటర్ యాజమాన్యానికి సోమవారం నోటీసులు జారీ చేసింది. మేము విచారణ జరిపికంటే ముందే…బీజేపీ నేతలు ట్యాగ్ చేసిన టూల్ కిట్ డాక్యుమెంట్స్ ను మీరు మ్యానిప్యులేట్ చేసినట్లుగా ఎలా గుర్తించారని, అందుకు సంబంధించి మీకు ఏమైనా ఆధారాలు లభ్యమైతే వెంటనే మాకు సమర్పించాలని ఢిల్లీ పోలీసులు కోరారు. అయితే ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసుకు ట్విటర్ తలతిక్క సమాధానం చెప్పింది. తమది అమెరికన్ కంపెనీ అని…, తమ సంస్థ రిజిస్టర్ అయ్యింది కూడా అమెరికాలోనేనని.., మీరు నోటీసులు అమెరికా అడ్రస్ కు పంపండి అంటూ ట్విటర్ ఇండియా హెడ్ సమాధానం చెప్పారు. ఈ సమాధానం వచ్చిన తర్వాత ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు..ట్విటర్ ఇండియా ప్రధాన కార్యాలయంతోపాటు, ఢిల్లీ, గుర్గావ్ ప్రాంతాల్లోని ట్వీటర్ కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. కాంగ్రెస్ టూల్ కిట్ వ్వవహారంలో తమకు లభించిన కొన్ని ఆధారాలను నిర్ధారించుకునేందుకు ఈ సోదాలు నిర్వహించామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ చేసిన ఫోర్జరీ డాక్యుమెంట్ల ఫిర్యాదుతోపాటు.., సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీమ్ చేసిన స్టడీ రిపోర్టుపై, అలాగే ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ట్విటర్ ను వేదికగా చేసుకుని కాంగ్రెస్ తోపాటు మరికొంతమంది లుటియెన్స్ జర్నలిస్టులు, మేధావులు నిజంగానే ఏమైనా కుట్రపన్నారనే కోణంలో సైతం విచారణ జరుపుతున్నట్లు ప్రచారం జరగడంతో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా ఖంగుతిన్నదని, ఇష్యూ తాము ఊహించినట్లుగా కాకుండా…మరింత పెద్దగా మారుతుండటంతోపాటు ట్విటర్ మెడకు సైతం చుట్టుకుంటుండంతో.., కాంగ్రెస్ తన ఫిర్యాదును వాపస్ తీసుకుని ఉంటుందని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు.
అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి.. ట్విటర్ కు మధ్య రాజకీయపరమైన రహస్య అవగాహన ఉందనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు ట్విటర్ సీఈవో జాక్ డోర్సే ఇండియాకు రావడం జరిగింది. ఆ సమయంలో ఆయన రాహుల్ గాంధీని కలవడం జరిగింది.
అలాగే ట్విటర్ సీఈవో జాక్ డోర్సే…సోకాల్డ్ లుటియెన్స్ జర్నలిస్టుగా పేరుగాంచిన బర్ఖా దత్ తోపాటు మరికొందరు కుహనావాదులతో కలిసి…ఐడియాలజీ ఫైట్ అగెనెస్ట్ బ్రాహ్మణికల్ పెట్రియార్కి ఫ్లకార్డును సైతం ప్రదర్శించారు. ఈ ప్లకార్డు ప్రదర్శనను మనం ఏవిధంగా అర్థం చేసుకోవాలి.?
అంతేకాదు 2018లో కేంబ్రిడ్జ్ అనాలిటికా అనే సంస్థ ఎన్నికల్లో తమ క్లయింట్లను గెలిపించేందుకు చీటింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేంబ్రిడ్జ్ అనాలిటికా మాజీ ఉద్యోగి క్రిష్టోఫర్ విలీ… భారత్ లో తమకు కాంగ్రెస్ పార్టీ క్లయింట్ అని.., పార్టీ కోసం తాము పనిచేశామని, ఫేస్ బుక్ తోపాటు, ట్విటర్ అందించిన డాటాను విస్తృతంగా వాడుకున్నామని కూడా తెలిపాడు. ఈ వివాదం బయటకు రావడంతో తమ యూజర్లకు సంబంధించిన డేటాను కేంబ్రిడ్జ్ అనాలిటికా సంస్థకు అమ్ముకున్నట్లుగా ఫేస్ బుక్ తోపాటు ట్విటర్ కూడా అంగీకరించిన విషయం మనం మర్చిపోరాదు.
ట్రేండింగ్ ప్రమోషన్ పేరుతో…ట్విట్టర్ ఫక్తు వ్యాపారం చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. సహజంగా ఏదైనా ఇష్యూ పై క్యాచీ హ్యాష్ ట్యాగ్ తో పోస్టు చేసినప్పుడు., వేల సంఖ్యలో దాన్ని రీట్విట్స్ చేస్తే… ఆ ఇష్యూ ట్రేండింగ్ లోకి వస్తుంది. ఈ ప్రమోషన్ కోసం తాము డబ్బులు తీసుకుంటామని ట్విటరే తెలిపింది.
మన దేశంలో రాజకీయంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో నెగటివ్ నెరెటివ్ ను బిల్ట్ చేయడంలో భాగంగా ట్విటర్ ఎక్కువగా ఈ ట్రేండింగ్ గేమ్ ఆడుతోందని.., తమ నెరెటివ్ కు అనుకూలంగా రీట్విట్లు, షేరింగ్ చేసేవారికి సైతం డబ్బులు ముట్టచెప్పుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.కోవిడ్ ఆపత్కాలం సమయంలో రీజైన్ మోదీ, మెదీ స్ట్రెయిన్, వంటి హ్యాష్ ట్యాగులతో ట్రేండింగ్ లోకి వచ్చిన విషయం అందరికి తెలిసిందే.
అంతేకాదు ఏదైనా ఇష్యూను, బిజినెస్ ప్రమోషన్ కు సంబంధించిన అంశాలను ట్రెండింగ్ లో తీసుకుని వచ్చేందుకు ట్వీటర్ అక్రమ వసూళ్లకు సైతం పాల్పడుతోందని ఐటీ నిపుణులు వినిత్ గోయెంకా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ట్విట్టర్ కార్యకలాపాలపై న్యాయపోరాటం చేస్తున్న వినిత్ గోయెంకా అనేక ఆధారాలను సైతం బయటపెట్టారు.
ఢిల్లీలో రైతుల పేరుతో కొంతమంది సూడో రైతు సంఘాల నాయకులు జరుపుతున్న ఆందోళన వెనుక ఖలిస్తాన్ ఉగ్రవాద అనుకూల సంస్థ పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్ హస్తం ఉన్నట్లు ఆధారాలు లభించాయి. దీనికి సంబంధించి అది రూపొందించిన టూల్ కిట్ ను గ్రేటా థన్ బర్గ్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అసలు కుట్ర బహిర్గతమైంది. ఇంత జరిగినా ట్విటర్ మాత్రం పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్ కు చెందిన మో ధనివాల్ తోపాటు మరికొందరి ట్విటర్ హ్యాండిల్స్ ను సస్పెండ్ చేయాలని కోరినప్పుడు…ట్విటర్ భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో నిరాకరించింది.
అలాగే ట్విటర్ లో ఇండియాన్ స్ట్రెయిన్ , మెదీ స్ట్రెయిన్, మోదీ వేరియంట్ వంటి పదాలను తొలగించాలని కోరినప్పుడు ట్విటర్ నిరాకరించింది. వితాండవాదం చేసింది.అదే సయంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సింగపూర్ వేరియంట్ ట్విట్ చేసినప్పుడు..సింగపూర్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. సింగపూర్ వేరియంట్ అనే పదాలను వెంటనే ట్విటర్ హ్యాండిల్స్ నుంచి తొలగించాలని ఆదేశ ప్రభుత్వం కోరిన వెంటనే ఆ పదాలను తొలగించింది.అంటే సింగపూర్ ప్రభుత్వం పట్ల ఒక విధంగా.., భారత ప్రభుత్వం పట్ల మరో విధంగా ట్విట్టర్ స్పందించడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి..! ఇది సోషల్ మీడియానా..? లేక కాంగ్రెస్ ఐటి సెల్ లో భాగమా..?
మే 26 కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన రోజు. ప్రధాని నరేంద్రమోదీ రెండోసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు కూడా..! దీంతో సోకాల్డ్ రైతు సంఘాల నాయకులతోపాటు కాంగ్రెస్ సహ 13 రాజకీయ పార్టీలు బ్లాక్ డే పేరుతో నిరసన ప్రదర్శనలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు రెడీ అయ్యాయి.
అరబ్ వసంతం, జాస్మిన్ విప్లవం పేరుతో అచ్చం ఇలాగే ట్విటర్.., ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల ప్రచారం మూలంగా అరబ్ దేశాల్లో అశాంతి నెలకొనడమేకాకుండా తిరుగుబాట్లు, హింసాకాండ సైతం చెలరేగింది.
ఈ క్రమంలో ట్విటర్ , ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టా, టెలిగ్రామ్ లతోపాటు ఓటీటీ వేదికలకు ఇండియన్ ఐటీ యాక్ట్-2021 ప్రకారం నూతన గైడ్ లైన్స్ ను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో జారీ చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ టూల్ కిట్ కేసు వ్యవహారంలో ట్విటర్ ఈ గైడ్ లైన్స్ ను ఉల్లఘించిందని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ట్విటర్ తోసహ సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం నోటిసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. వీటికి సమాధానం ఇవ్వని సోషల్ మీడియా సంస్థలను మరో రెండు మూడు రోజుల్లో బ్లాక్ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా ఇలాంటి సోషల్ మీడియాసంస్థలను అదుపులో ఉంచాల్సినా అవసరం ఉందా లేదా? జస్ట్ ఆస్కింగ్.!