ఢిల్లీలో రైతుల పేరుతో జరిగిన ఆందోళనలను ఆసరాగా చేసుకుని దేశంలో అస్థిరత్వాన్ని సృష్టించేందుకు రూపొందించిన గ్రేటా థన్ బెర్గ్ టూల్ కిట్ కుట్ర వ్యవహారాన్ని జనం ఇంకా మర్చిపోకముందే…. తాజాగా మరోక టూల్ కిట్ బండారం బయటపడింది. అయితే బయటపడిన ఈ రెండో టూల్ కిట్ కు కర్త.. కర్మ… అంతా కూడా కాంగ్రెస్ పార్టీయేనని తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ లోగోతో కూడిన ఈ టూల్ కిట్ డాక్యుమెంట్లు బీజేపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో #CongressToolkitExposed పేరుతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇది ట్రేండింగ్ లో నడుస్తోంది.
ఇంతకీ కాంగ్రెస్ పార్టీ పేరుతో బయపడిన ఈ టూల్ కిట్ లో ఏముందో తెలుసా? నాలుగు పేజీలతో కూడిన టూల్ కిట్ డాక్యుమెంట్లను పరిశీలిస్తే.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టార్గెట్ గా పక్కా ప్లాన్ తో ఈ టూల్ కిట్ ను రూపొందించినట్లుగా అర్థం అవుతోంది. కార్పేట్ బాంబింగ్ తరహాలో ప్రధాని మోదీపై ముప్పేటదాడికి సంబంధించి ఏ ఒక్క అంశాన్ని వదలకుండా..ఈ డాక్యుమెంట్ లో తమ పార్టీ కార్యకర్తలు..ఎప్పుడు ఏమేమి చేయాలో స్పష్టంగా తెలిపింది.
మన దేశంలో కరోనా పెరగగానే అందుకు కుంభమేళా కారణం అంటూ నేషనల్ మీడియాతోపాటు, ప్రాంతీయ మీడియాలో అదేపనిగా కథనాలు ప్రసారం కావడం వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందా అంటే ఈ టూల్ కిట్ ను పరిశీలిస్తే..ఎవరైనా సరే ఉందనే అంటారు. కుంభమేళాను కరోనా సూపర్ స్ప్రెడర్ గా ప్రచారం చేయాలని ఈ టూల్ కిట్ లో కాంగ్రెస్ తమ పార్టీ వర్కర్లకు చాలా క్లియర్ గా ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చింది. హిందూ పండుగలను కించపరడంతోపాటు..ముస్లింలు జరిపే ఈద్ లను శాంతి సౌభాగ్యాలకు నిలయంగా ప్రచారం చేయాలని సూచించింది.
అంతేకాదు అంతర్జాతీయ మీడియాలో సైతం భారత ప్రభుత్వాన్ని తప్పుపెట్టేవిధంగా కథనాలను రూపొందించాలని… అందుకు కాంగ్రెస్ అనుకూల జర్నలిస్టుల సహాయం తీసుకోవాలని కూడా టూల్ కిట్ లో సూచించింది. అలాగే అంతర్జాతీయ పత్రికల్లో వచ్చిన కొన్ని నివేదికలను ప్రమాణంగా చూపేడుతూ మోదీ ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలని కూడా తెలిపింది. అంతేకాదు ముస్లింల ఈద్ కు సంబంధించిన ఫోటోలు సెలెక్షన్ చేసేటప్పుడు ఐటీ సెల్ సిబ్బంది, పార్టీ మద్దతుదారులు తగు జాగ్రత్త వహించాలని కూడా హెచ్చరించింది.
ఇక పీఎం మోదీని కార్నర్ చేయడానికి మోదీ సూపర్ స్ప్రెడర్ అనే పదాన్ని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకుని రావాలని కార్యకర్తలకు ఆర్డర్లు వేసింది కాంగ్రెస్ పార్టీ. అలాగే శ్మశాన జర్నలిజాన్ని పోత్సాహించాలని, అంత్యక్రియలకు సంబంధించిన చిత్రాల్లోని ప్రజల ఎమోషన్స్ క్యారీ అయ్యే విధంగా చూడాలని.., వాటిని చూసిన వెంటనే జనం భావోద్వేగాలకు గుర్యేలా.., ఈ విషాదానికి పీఎం మోదీయే బాధ్యుడు అనేలా వాల్ పోస్టర్స్ ను డిజైన్ చేసి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి తీసుకుని రావాలని తెలిపింది.
ఇటు మన దేశంలో ప్రవేశించిన రెండో దశ కరోనా డబుల్ మ్యూటెంట్ వేరియంట్ ను బ్రిటన్ వేరియంట్ గా పిలుస్తున్నారు. ఉత్తర భారతంలోని అనేక రాష్ట్రలో ఈ బ్రిటన్ వేరియంట్ ను గుర్తించడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం… దీనిని బ్రిటన్ వేరియట్ అనకుండా.., ఇండియన్ స్ట్రెయిన్ అనే పదాన్ని ఉపయోగించాలని తన కార్యకర్తలకు హిత బోధ చేసింది. మొదట ఇండియన్ స్ట్రెయిన్ పదాన్ని పార్టీ ఐటి సెల్ కార్యకర్తలు ప్రచారంలోకి తీసుకుని రావాలని.., ఆ తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పార్టీ సానుభూతిపరుల ద్వారా ఇండియన్ స్ట్రెయిన్ పదాన్ని కాస్తా.. మోదీ స్ట్రెయిన్ మార్చి ప్రచారంలోకి తీసుకుని రావాలని ఆదేశించింది.
అలాగే పీఎం కేర్స్ ఫండ్ కేటాయింపులపై ప్రధాని మోదీని ఎలా తప్పుపట్టాలి. ఏలా ఆయన్ను దోషిగా నిలిపే ప్రయత్నాలు చేయాలో కూడా కాంగ్రెస్ తన టూల్ కిట్ లో వివరించింది. పీఎం మోదీ తన సొంతరాష్ట్రాం గుజరాత్ కే ఎక్కువ కేటాయింపులు జరుపుతున్నారనే ప్రచారాన్ని హైలేట్ చేయాలని కోరింది. ప్రధాని మోదీని దూకుడుగా ప్రశ్నించాలని దిశానిర్దేశం చేసింది. పీఎం కేర్స్ ఫండ్ లో అధికభాగం గుజరాత్ కే కేటాయిస్తున్నారని, వ్యాక్సిన్లు, మందులు, వెంటిలెటర్లు అన్నికూడా మొదట గుజరాత్ కు పంపిన తర్వాతే మిగిలినవి ఇతర రాష్ట్రాలు పంపిచడం జరుగుతోందని.. ప్రజలను నమ్మించేలా కథనాలను రూపొందించాలని ఆదేశించింది.
అంతేకాదు కరోనా కల్లోల సమయంలో కొత్త పార్లమెంటు భవనం.. సెంట్రల్ విస్టా నిర్మాణం అవసరమా ? అంటూ ప్రచారంలోకి తీసుకుని రావాలని కాంగ్రెస్ తన కార్యకర్తలను ఈ టూల్ కిట్ సూచనల ద్వారా కోరింది. దేశంలో భయనక పరిస్థితులుంటే ప్రధానమంత్రి మాత్రం తన సొంత ఇంటి నిర్మాణంపై శ్రద్ధవహిస్తున్నాడని.., ఆ నిధులను కోవిడ్ కట్టడికి ఖర్చు పెట్టాలని జర్నలిస్టుల ద్వారా , విద్యావేత్తల ద్వారా ట్వీట్లు చేయించాలని కూడా కోరింది.
ఇంకా ప్రధాని నరేంద్రమోదీతోపాటు, కేంద్రమంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, జైశంకర్లు తప్పిపోయారనే ప్రచారాన్ని సైతం కొనసాగించాలని.. వీలైనంత వరకు కూడా కరోనా సెకండ్ వేవ్ కు పీఎం మోదీనే బాధ్యుడిని చేశాలా ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉండాలని తన టూల్ కిట్ లో కాంగ్రెస్ పార్టీ కోరింది.
మొత్తంగా బీజేపీ వెలుగులోకి తీసుకుని వచ్చిన ఈ టూల్ కిట్ ను పరిశీలిస్తే ఈ కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో నేషనల్ మీడియాలోని కొన్ని చానళ్లు…అలాగే తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చిన కథనాలు .. హెడ్డింగులను చూసిన తర్వాత.. ఈ చానళ్లు అన్ని కూడా కాంగ్రెస్ ఈకో సిస్టమ్ లో భాగమేనని అనిపించకమానదు.
It’s quite unfortunate we have a opposition party which is doing the work of Pakistan jehadi groups. It’s a national shame to have parties like congis, commis, TMC and other parties