National

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో టీకాల వృథాపై రాహుల్ ఏమంటారు?

కేంద్ర ప్రభుత్వం ఎంతగా జాగ్రత్తలు చెబుతున్నా…, రాష్ట్రాలు మాత్రం కోవిడ్ వ్యాక్సిన్ల వృథాను అరికట్టలేకపోతూనే ఉన్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ల వృథాకు సంబంధించి ఒక ప్రకటనను విడుదల చేసింది. వ్యాక్సిన్ వృథా విపరీతంగా ఉంటుండంపై తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. వ్యాక్సిన్ వృథాను ఒక శాతం కంటే తక్కువే ఉంచాలని కేంద్రం పదే పదే రాష్ట్రాలను కోరుతూనే ఉంది.

అయితే అదేంటో కానీ కోవిడ్ వ్యాక్సిన్లు వృథా చేస్తున్న  రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి రూలింగ్ రాష్ట్రాలు ముందు వరుసలో ఉంటున్నాయి. జార్ఖండ్ , ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో మూడోంతుల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు వృథా చేసినట్లు పేర్కొంది. జార్ఖండ్ రాష్ట్రంలో అత్యథికంగా 37 శాతం టీకాలు వృథా కాగా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో 30 శాతం వరకు వ్యాక్సిన్లను వృథా చేయడం జరిగింది.

అంతేకాదు తగిన కోవిడ్ టీకాలు తమకు సరఫరా కాలేదని జార్ఖండ్ , చత్తీస్ గఢ్ రాష్ట్రాల మంత్రులు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇక కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అయితే .. సరిపడా వ్యాక్సిన్లు  లేవని.., వ్యాక్సిన్లు కొనకుండా.. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారని… ప్రధాని మంత్రి జవాబ్ దో అంటూ అదే పనిగా ట్వీట్లు చేయడం మనం జరిగింది.

రాహుల్ గాంధీ… ప్రధాని మోదీని ప్రశ్నించడం వరకు  బాగానే ఉన్నా.., కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో  డోసుల వేస్టేజీ పై రాహుల్ ఎందుకు మౌనంగా ఉన్నారు.? కరోనా వ్యాక్సిన్ల వృథా కట్టడి కోసం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని.. కాంగ్రెస్ పార్టీ అధినేతగా  కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను రాహుల్ గాంధీ ఎందుకు ప్రశ్నించడం లేదు?

కరోనా వ్యాక్సినేషన్ కు మోదీ ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటి నుంచి రాహుల్ గాంధీతోపాటు మిగతా కాంగ్రెస్ నేతలు డబుల్ స్టాండ్స్ ను ప్రదర్శించారు. మొదట కోవిడ్ వ్యాక్సిన్లపైనే అనుమానాలు వ్యక్తం చేశారు. తమదైన కామెంట్లలో … సోషల్ మీడియా ప్రచారాల ద్వారా.., వ్యాక్సినేషన్ పై ప్రజలను అయోమయానికి గురి చేశారు. ఛత్తీస్ గఢ్ కు చెందిన కాంగ్రెస్ నేతలు.., మంత్రులు సైతం వ్యాక్సినేషన్ పై అనేక వివాదాస్పద కామెంట్లు చేశారు. వ్యాక్సిన్ వేసుకోమని కూడా ప్రకటనలు ఇచ్చారు.

మళ్లీ ఇదే కాంగ్రెస్ నేతలు తమ పార్టీ ప్రభుత్వాలున్న రాష్ట్రాలకు తగినన్ని వ్యాక్సిన్లను సరఫరా చేయడం లేదని ప్రచారం చేశారు. తగినన్ని వ్యాక్సిన్లను సరఫరా చేసిన తర్వాత… వ్యాక్సిన్ల వేస్టేజీని అరికట్టడంలో మాత్రం విఫలం అవుతున్నారు.

అలాగే కోవిడ్ టీకాలుతీసుకున్నవారికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే సర్టిఫికేట్లపై కాంగ్రెస్  పాలిత రాష్ట్రాలు పీఎం నరేంద్రమోదీ ఫోటోను తొలగించాయి. ఒకవైపు దేశంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.., ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయాల కోసం ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయాలు కట్టిపెట్టి.. అందరం కలిసి కరోనాను ఓడించాల్సిన సమయం ఇది. కానీ ఏం చేస్తాం? కాంగ్రెస్ ఇప్పటికైనా మాట వింటుందా? మళ్లీ అవే రాజకీయాలు చేస్తుందా? జస్ట్ వెయిట్ అండ్ సీ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × 4 =

Back to top button