More

  వీడియో వైరల్.. విమానంలో కేరళ సీఎంకు చేదు అనుభవం..!

  కేరళ సీఎం పినరయి విజయన్‌కు విమానంలో చేదు అనుభవం ఎదురైంది. జూన్‌ 13న విమానంలో ముఖ్యమంత్రి.. కన్నూరు నుంచి తిరువనంతపురం వెళ్తున్నారు. అదే విమానంలో నల్ల అంగీలు ధరించిన ఇద్దరు యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు సీఎం ఎదుట ఆందోళనకు దిగారు.

  ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. అయితే అప్రమత్తమైన లెఫ్ట్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్ కన్వీనర్ ఈపీ.జయరాజన్‌ వారిని అడ్డుకుని నెట్టేశారు. ఈ వ్యవహారాన్నంతా ఓ ప్రయాణికుడు వీడియోతీశాడు. ప్రస్తుతం అది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని కేరళకు చెందిన సీపీఎం ఎంపీ వీ.శివదాసన్‌ డీజీసీఏ డైరెక్టర్‌ జనరల్‌కు లేఖ రాశారు. బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. అలా చేయడం విమాన భద్రత నిబంధనలకు భంగం కలిగించడమే అవుతుందని పేర్కొన్నారు. విమానంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.

  spot_img

  Trending Stories

  Related Stories