ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లిఖార్జున్‌ ఖర్గే విజయం

0
880

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లిఖార్జున్‌ ఖర్గే గెలుపొందారు. 7 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్‌కు గాంధీయేతర అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టనున్నారు. మొత్తం 9,385 ఓట్లలో ఖర్గేకు 7,897 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి శశిథరూర్ 1,072 ఓట్లు వచ్చాయి. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ పదవి నుండి తప్పుకున్నప్పటి నుండి కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు ఖర్గే ఆ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఖర్గే విజయం సాధించినందుకు అభినందనలు తెలుపుతూ థరూర్ ట్వీట్ చేశారు. అయితే అంతకుముందు శశిథరూర్‌ ఏజెంట్ సంచలన కామెంట్స్‌ చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు చేశారు. పెద్ద ఎత్తున రిగ్గింగ్‌ కూడా జరిగిందని ఆరోపిస్తూ.. కాంగ్రెస్‌ ఎలక్షన్‌ చైర్మన్ మధుసూధన్ మిస్త్రీకి శశి థరూర్ ఏజెంట్‌ సల్మాన్‌ సోజ్‌ ఫిర్యాదు చేశారు.