More

    ఫీల్డ్ మార్షల్ కరియప్ప ఫోటోకు బదులు మానెక్ షా ఫోటో …కాంగ్రెస్ ఐటీ సెల్ తీరుపై నెటిజన్ల ఆగ్రహం…

    ఎవరు? ఏమిటీ..? ఎలా ఉంటారు? అనే విషయాలపై కాసింతనైనా విషయ పరిజ్ఞానం ఉండాలి.! ఉద్దేశం మంచిదే అయినా చేసే చిన్న పొరపాట్లు..నలుగురిలో నవ్వులపాలు చేస్తాయి.! ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ టీమ్ కాసింత దృష్టి పెడితే బాగుంటుందని అంటున్నారు నెటిజన్లు! ఇంతకీ విషయం ఏమిటంటే… స్వాతంత్ర్య భారత మొదటి కమాండర్ ఇన్ చీఫ్..ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప వర్థంతి రోజు. దీంతో దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేస్తూ ట్వీటర్ లో పోస్టు చేసింది కాంగ్రెస్ పార్టీ. 1947 మొదటి కశ్మీర్ వార్ సమయంలో ఆయన నాయకత్వ పటిమ, అలాగే ఆయన చూపిన శౌర్యాన్ని ప్రశంసించింది ఆ పోస్టులో..! అయితే పోస్టు చేసిన వ్యాక్యాల వరకు బాగానే ఉన్నా… ఫోటో విషయం వచ్చేసరికి మాత్రం కాంగ్రెస్ ఐటీ సెల్ కన్ఫ్యూజ్ కు గురైంది. ఫీల్డ్ మార్షల్ కరియప్ప ఫోటో బదులుగా.., ఫీల్డ్ మార్షల్ శామ్ మానెక్ షా ఫోటోను ట్యాగ్ చేసి పోట్ చేసింది.

    ఇంకేముంది అసలే డిజిటల్ జమానా..! ఏదైనా సరే నెటిజన్లు ఇట్టే పట్టేస్తారు. కాంగ్రెస్ పార్టీ తీరే ఇంత అని.., నిజమైన భారత హీరోలను పట్టించుకోదని.., పైగా అజ్ఞానంతో వారిని అవమానపరుస్తోందని కొంతమంది ఆవేదన వ్యక్తం చేయగా…మరి కొంతమంది అయితే కాంగ్రెస్ తీరును మందలించారు.  

    ఇక ప్రముఖ కాలమిస్టు కంచన్ గుప్తా అయితే దేశంలోనే ఓల్డ్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీకి అప్పటి తరం సైనిక హీరోలను గుర్తించలేకపోవడం దారుణమన్నారు. ఇప్పడే ఇలా ఉండే ఇక రాహుల్ చేతుల్లోకి వెళితే అనే అర్థం వచ్చే రీతిలో వ్యంగ్యకామెంట్లు చేశాడు. మరికొంతమంది నెటిజన్లు కంచన్ గుప్తా చేసిన పోస్టును ట్యాగ్ చేసి కాంగ్రెస్  పై విమర్శలు గుప్పించారు. జాతికి కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నెటిజన్ల ట్రోలింగ్ తో హోష్ లోకి వచ్చిన కాంగ్రెస్ ఐటీ సెల్ ఆ తర్వాత ఫోటోను మార్చి కరియప్ప ఫోటోతో మళ్లీ రీ పోస్ట్ చేసింది.

    Trending Stories

    Related Stories