National

కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చిన ట్విట్టర్

సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారిక హ్యాండిల్ తో పాటు, 5 వేల మంది పార్టీ కార్యకర్తలు, నేతల ఖాతాలను ట్విట్టర్ బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఢిల్లీలో గత వారం తొమ్మిదేళ్ల దళిత బాలికను అత్యాచారం చేసి హత్యచేశారు. ఆ తర్వాత బాధితురాలి కుటుంబాన్ని తన కారులో కూర్చోబెట్టుకుని రాహుల్ గాంధీ ఓదార్చారు. వారి వివరాలు తెలుపుతూ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీంతో ట్విట్టర్ ఆయన ఖాతాను తాత్కాలికంగా లాక్ చేసింది. అత్యాచార బాధితురాలికి సంబంధించిన వివరాలను వెల్లడించడాన్ని ట్విట్టర్ స్వాగతించదు.. అందుకే రాహుల్ గాంధీ అకౌంట్ ను లాక్ చేసింది. ఇలా కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వడాన్ని ఆ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. కేవలం ఎంపిక చేసుకున్న వారి ఖాతాలనే ఎందుకు బ్లాక్ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఇప్పుడు ఆ కాంగ్రెస్ ఖాతానూ ట్విట్టర్ బ్లాక్ చేసింది. ఎదుటి వ్యక్తుల అనుమతి లేకుండా వారి వ్యక్తిగత సమాచారాన్ని పోస్ట్ చేసినందుకుగానూ ఖాతాను బ్లాక్ చేస్తున్నట్టు తెలిపింది. ఇది కేవలం ట్విట్టర్ నియమాలకు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయమైనా.. కాంగ్రెస్ పార్టీ భారతప్రధాని నరేంద్ర మోదీని ఈ వివాదంలోకి లాగింది.

‘‘మోదీ గారూ.. మీకు ఎందుకంత భయం? దేశ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ పోరాడింది. సత్యం, అహింస, ప్రజల ఆశీస్సులనే ఆయుధాలుగా మలిచి గెలిచాం. ఇప్పుడూ గెలుస్తాం’’ అని ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో కాంగ్రెస్ పార్టీ పోస్టులో పేర్కొంది. ట్విట్టర్ ను బీజేపీ ప్రభుత్వం బెదిరిస్తోందని ఆరోపించింది. ట్విట్టర్ బ్లాక్ చేసిన ప్రముఖుల అకౌంట్ల లో సుర్జేవాలా, అజయ్ మాకెన్, సుస్మితా దేవ్, జితేందర్ సల్వార్, మాణిక్కం ఠాగూర్ వంటి వారు ఉన్నారని కాంగ్రెస్ చెప్పింది. ఇక రాహుల్ గాంధీ ఖాతాను పునరుద్ధరించాలని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ డిమాండ్ చేశారు. ఈ నెల 2న ఎస్సీ కమిషన్ బాధితుల ఫొటోను పోస్ట్ చేసినా ట్విట్టర్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కేవలం ప్రతిపక్ష నేతలపైనే చర్యలు తీసుకోవడం ఆందోళన కలిగించే విషయమని అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twenty − 16 =

Back to top button