కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను నిర్మించేందుకు ఉత్తరప్రదేశ్‌లోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దాదాపు 200 దేవాలయాలను కూల్చివేసిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. శనివారం నాడు.. ఆలయ కూల్చివేతకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌లో షేర్ చేసింది. కాశీ విశ్వనాథ్ కారిడార్ నిర్మాణానికి దాదాపు 200 దేవాలయాలు, ఒక శివలింగాన్ని కూల్చివేయాల్సి వచ్చిందని వారణాసి కాంగ్రెస్ ట్వీట్‌లో పేర్కొంది. దాదాపు 5000 సంవత్సరాల నాటి భారత మాత ఆలయాన్ని కూడా కూల్చివేశారని వారణాసి కాంగ్రెస్ విభాగం తెలిపింది. ఇళ్లు కూల్చివేస్తున్న సమయంలో గుడి బయటపడిందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఆలయ కూల్చివేత వీడియోను పంచుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఇది బనారస్ కు సంబంధించిన వీడియో అని తెలిపింది. ప్రశాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీపై విమర్శలు చేసే తొందరలో కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పొరపాటునే చేసింది.

కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను నిర్మించడానికి బీజేపీ ప్రభుత్వం వారణాసిలో ఎన్నో దేవాలయాలను కూల్చివేసిందని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ ఓ కూల్చివేతకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. తీరా చూస్తే ఆ వీడియో వారణాసి(బనారస్) కు చెందినది కానే కావు. గత ఏడాది జూలైలో తమిళనాడులోని కోయంబత్తూరు నగర కార్పొరేషన్ అధికారులు ఆలయ కూల్చివేత కార్యక్రమానికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ ఇలా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి షేర్ చేసింది.
కోయంబత్తూరు పౌరసంఘం అధికారులు ముతానంకులం బండ్ వద్ద కూల్చివేతలు చేపట్టి ఏడు దేవాలయాలను కూల్చివేశారు. అధికారుల సమక్షంలోనే అమ్మన్ కోవిల్, బన్నారి అమ్మన్ కోవిల్, అంగళ పరమేశ్వరి, కరుప్పరాయన్ కోవిల్, మునీశ్వరన్ కోవిల్‌తో పాటు మరికొన్ని ఆలయాలను కూల్చివేశారు. ముఖ్యంగా 100 ఏళ్ల నాటి ఏడు దేవాలయాల కూల్చివేతపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమిళనాడులోని శతాబ్దాల నాటి హిందూ దేవాలయాలపై ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం దాడులు చేసిందని నెటిజన్లు ఆరోపించారు.
తమిళనాడులో తన కూటమి భాగస్వామి, ద్రవిడ మున్నేట్ర ఖజగం నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఖండించడానికి బదులుగా, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో బీజేపీకి వ్యతిరేకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడంలో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ప్రచారం చేస్తూ పట్టుబడటంతో కాంగ్రెస్ పార్టీ ఆ ట్వీట్‌ను తొలగించేసింది.