రైలు బోగీలో కాంగ్రెస్ కామాంధులు..! ఒంటరి మహిళపై లైంగిక వేధింపులు..!!

0
758

కొన ఊపిరితో ఉన్న కాంగ్రెస్ పార్టీకి.. ఆ పార్టీ నేతలే గొయ్యి తవ్వుతున్నారు. హస్తం పార్టీని భూస్థాపితం చేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. విపక్ష పార్టీలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా.. గ్రాండ్ ఓల్డ్ పార్టీని గల్లంతయ్యేలా చేస్తున్నారు. ఓవైపు తమ నాయకుడు భారత్‎ను జోడిస్తానంటూ దేశాటన చేస్తుంటే.. ఆ పార్టీ ప్రజాప్రతినిథులు పాడు పనులు చేస్తూ.. పేరు ప్రఖ్యాతలు జోడిస్తున్నారు. మధ్యప్రదేశ్‎కు చెందిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. రైల్లో తోటి ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ కీచక ఎమ్మెల్యేలు చేసిన జుగుప్సాకర చర్యను చూసి సభ్య సమాజం ముక్కున వేలేసుకుంటోంది.

మధ్య ప్రదేశ్ సత్నా నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మల్యే సిద్ధార్థ్ కుష్వాహా,.. కోటమా నియోజకవర్గం ఎమ్మెల్యే సునీల్ సరాఫ్.. ఫూటుగా తాగి రైలెక్కారు. ఏసీ బోగీలో వీరంగం చేశారు. అదే బోగీలో ప్రయాణిస్తున్న 32 ఏళ్ల మహిళతో అనుచితంగా ప్రవర్తించారు. దీంతో ఆమె తీవ్ర భయాందోళనకు గురైంది. ఈ సంఘటన అక్టోబరు 6 అర్థరాత్రి కట్నీ, దామోహ్ స్టేషన్ల మధ్య ప్రయాణిస్తున్న రేవాంచల్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగింది. రేవా నుంచి భోపాల్‌కు ప్రయాణిస్తున్న బాధిత మహిళ ఫిర్యాదు ఆధారంగా,.. మధ్యప్రదేశ్ పోలీసులు ఇద్దరు కాంగ్రెస్ నేతలపై కేసు నమోదు చేశారు.

రేవాంచల్ ఎక్స్‎ప్రెస్ ఏసీ కోచ్‎లో ఏడు నెలల పసిపాపతో ఓ మహిళ ప్రయాణిస్తోంది. ఆమె వద్దకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చి, ఎదుటి బెర్త్‎లో కూర్చున్నారు. తమ సీట్లు, బెర్త్‎లు కాకపోయినా.. అక్కడ కూర్చుని డిన్నర్ చేయడం మొదలెట్టారు. భోజనం చేస్తున్నప్పుడు, పసిపాపతో వున్న మహిళపై చూపులు సారించి,.. పిచ్చి ప్రేలాపనలు మొదలెట్టారు. ఇద్దరూ ఒకరితో ఒకరు అసభ్యకరమైన భాషలో సంభాషించుకున్నారు. ఈ విషయాలను బాధిత మహిళ పోలీసులకు వివరించింది.

ఎమ్మెల్యేలు తనను స్పర్శిస్తూ.. తమతో కలిసి భోజనం చేయాలని డిమాండ్ చేశారని, వారిలో ఒకరు నా భుజంపై చేయివేసి పరుష పదజాలంతో మాట్లాడాడని కన్నీటి పర్యంతమైంది. ఓ వైపు నిద్రపోతున్న బిడ్డను, తననూ ఏం చేస్తారో అని భయపడుతూనే ఎమ్మెల్యేల కీచక పర్వాన్ని సెల్‎ఫోన్‎లో భర్తకు వివరించింది. దీంతో న్యాయవాది అయిన ఆమె భర్త, ఫోన్‎లోనే ధైర్యం చెప్పాడు. తర్వాత ఈ విషయాన్ని సాగర్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రైల్వే మంత్రికి కూడా ట్వీట్ చేశాడు. దీంతో, అలెర్టయిన సాగర్ రైల్వే పోలీసులు.. మహిళ వద్దకు GRP బృందాన్ని పంపించి,.. ఆమెను వేరే సీటుకు బదిలీ చేశారు.

మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు, రైలు సాగర్ చేరుకున్నప్పుడు, ఫిర్యాదుకు సంబంధించి.. ఒక సబ్-ఇన్‌స్పెక్టర్, ఇద్దరు కానిస్టేబుళ్లు కోచ్‌లోకి ప్రవేశించి నిందితులపై చర్యలకు ఉపక్రమించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సరాఫ్, కుష్వాహపై కేసు నమోదు చేశామని.. సాగర్ రైల్వే పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ అహిర్వార్ తెలిపారు.

బాధితురాలిని మరో సీటుకు తరలిస్తున్నప్పుడు..సైతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పిచ్చి ప్రేలాపనలు చేశారు. ఎందుకు వెళ్లిపోతున్నావు, ఎందుకు కలత చెందుతున్నావు..? అంటూ వెకిలి మాటలు మాట్లాడారు. ఈ విషయంపై కూడా.. మహిళ టీటీఈకి, సాగర్ రైల్వే పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసింది. తనతో అనుచితంగా ప్రవర్తించిన ఎమ్మెల్యేలను వెంటనే రైలు నుంచి దింపాలని బాధిత మహిళ డిమాండ్ చేసినా.. ఎవరూ పట్టించుకోలేదు. తర్వాత కూడా అదే ట్రయిన్‎లో మద్యం మత్తులోనే కులాసాగా ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలిద్దరూ ప్రయాణం సాగించారు.

అయితే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధార్థ్ కుష్వాహా, సునీల్ సరాఫ్ బాధిత మహిళ చేసిన ఆరోపణలు కొట్టిపారేశారు. ఈ ఆరోపణలు నిరాధారమని,.. తాము సత్యసంధులమని,.. అబద్ధాలు ఆడడం,.. మందు తాగడం తమకు తెలియదని,.. మేము మందు సేవించమని,.. మాకు బాగా తెలిసిన వారికి తెలుసని వెర్రిమొర్రి వ్యాఖ్యానాలు చేశారు. ఆ మహిళకు తాము బెర్త్ ఇచ్చామని, పిల్లవాడు నిద్రపోతున్నాడని లైట్లు సైతం ఆన్ చేయలేదని.. జెంటిల్మన్ వేషాలేశారు. తాము ఆమె ముఖం సైతం చూడలేదని, ఆమె తమపై అనవసర నిందలు వేసిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సునీల్ సరాఫ్ తెలియజేయగా, ఇదంతా కుట్రగా అనిపిస్తోందని సిద్ధార్థ్ కుష్వాహా తెలిపారు.

ఇదిలావుంటే, కాంగ్రెస్ నేతల తీరుపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనతో కాంగ్రెస్ పార్టీ అసలు రంగును బట్టబయలు అయ్యిందని మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వి. డి. శర్మ మండిపడ్డారు. రైల్లో మహిళను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వేధించినా, మహిళా సాధికారత గురించి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ లెక్చర్లు ఇస్తున్నారని విమర్శించారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

seventeen + ten =