More

  మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లో కీచక ఎమ్మెల్యే.. మహిళపై లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్..!!

  దారుణాలు చేసి కారణాలు చెప్పడం మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలకు మామూలైపోయింది. అమాయక యువతులకు కట్టు కహానీలు చెప్పి ప్రేమ ముగ్గులోకి దించడం, పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక వేధింపులకు పాల్పడడ ఈ నేతలకు రివాజుగా మారింది. గతంలో రైల్లో ఒంటరిగా ప్రయాణిస్తున్న యువతితో తప్పతాగిన ఎంపీ కాంగ్రెస్ నేతలు ఇటీవల చేసిన హంగామా అంతా ఇంతాకాదు. అంతకు ముందు ఈ తరహా అనుచిత ఘటనలు ఎన్నింట్లోనో.. కాంగ్రెస్ నేతలు పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఇప్పుడు అదే మధ్యప్రదేశ్ లో, అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత మరో అమాయక మహిళపై అనుచితంగా ప్రవర్తించి, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మిత్రులారా ఈ అంశాన్ని చూసే ముందు మీరు చేయాల్సి పని గుర్తుంది కదా..! మన గ్రూపాఫ్ ఛానెల్స్ ను సబ్ స్క్రయిబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. పదిమందికీ ఈ వీడియోను షేర్ చేసి జాతీయవాద జర్నలిజానికి మద్దతు తెలపండి.

  మధ్యప్రదేశ్ ధార్ జిల్లాకు చెందిన మహిళను మానసికంగా, శారీరకంగా వేధించి.. లైంగిక దాడికి పాల్పడినట్టు మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉమంగ్ సింగర్ పై కేసు నమోదైంది. ధార్ జిల్లాలోని గాంధీవాణి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమంగ్ మాయమాటలో ఆమెను ప్రేమ ముగ్గులోకి దించి లైంగిక వేధింపులకు పాల్పడినట్టు వెల్లడైంది. వ్యవహారం ముదిరి పాకాన పడి, బండారం బయట పడిపోవడంతో.. ఆ మహిళ తన భార్య అని చెప్పడం మొదలెట్టాడు. గతంలో.. పెళ్లి సాకు చూపించి ఏకపక్ష ప్రేమ వ్యవహారం సాగించాడు. ఆ ప్రతిపాదను ఆ తిరస్కరించి, ఛీ కొట్టినా సిగ్గు, శరమూ లేకుండా వ్యవహరించి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. గతంలో ఎన్నోసార్లు తన ఇష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేత ఉమంగ్ సింగర్ వ్యవహరించాడని, తనపై లైంగిక దాడి సాగించాడని ఆ మహిళ తెలియజేసింది. కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ హయాంలో.. ఈ ఘనుడు అటవీశాఖ మంత్రిగా పదవి వెలగబెట్టాడని తెలిసింది. అంతేకాదు, సదరు ఎమ్మెల్యే కమల్ నాథ్ కు రాజకీయంగా అత్యంత సన్నిహితుడని తెలిసింది.

  బలవంతంగా ఆ మహిళను ప్రేమ ముగ్గులో దించి, లైంగిక వేధింపులకు పాల్పడిన ఉమంగ్, ఇదిగో పెళ్లి చేసుకుంటా, అదిగో పెళ్లి చేసుకుంటా.. అని మాయ కబుర్లు చెప్పడం మొదలెట్టాడు. దీంతో, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆ మహిళ వెల్లడించింది. దీంతో, తన గుట్టు కాస్తా రట్టయిపోతుందని భయపడి.. గత ఏప్రిల్ 16 న ఆమెను వివాహం చేసుకున్నాడు.

  పరిస్థితులు వ్యతిరేకంగా మారి, పరువు బజారుకెక్కే పరిస్థితి రావడంతో.. మనస్సులో దురుద్దేశాన్ని దాచుకుని ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇక పెళ్లయిన వెంటనే తనలోని హింసా ప్రవృత్తిని బయటకు తీయడం మొదలెట్టాడు. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడి, అసభ్యకర వీడియోలు చిత్రీకరించి బ్లాక్ మెయిలింగ్ కు దిగాడు. దీంతో, ఆమె పోలీసులకు తన గోడు తెలియజేసింది. ఏడాది కాలంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే తనపై అత్యాచారం చేయడమే కాకుండా.. వేధిస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది. మహిళ ఫిర్యాదు మేరకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. భారత శిక్షాస్మృతి లోని గృహ హింస, అమానుష హింస, లైంగిక దాడి, నేరపూరిత బెదిరింపుల కింద సింగర్‌పై కేసులు నమోదు చేసినట్టు ధార్ జల్లా SP ఆదిత్య ప్రతాప్ సింగ్ తెలిపారు. ఎమ్మెల్యే ఉమంగ్‎పై భారత శిక్షాస్మృతిలోని 376, 377, 498 కింద ధార్‌లోని నౌగావ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామన్నారు.
  ఇలా బరిదెగించి ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ నేతలపై రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారు. పాడు పనుల్లో ఫస్ట్, ప్రజా సేవలో లాస్ట్, మహిళలంటే గౌరవం లేదు, మంచి, మర్యాదలకు ఆమడ దూరం..ఇదీ కాంగ్రెస్ నేతల తీరని విమర్శిస్తున్నారు. క్రిమినల్స్ లా మారుతున్న కాంగ్రెస్ నేతలపై తగిన చర్యలు చేపట్టి, అమాయక ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

  Trending Stories

  Related Stories