More

  భారత్ జోడో యాత్రకు లక్షలాది జనం..! గూగుల్ తల్లి తేల్చేసిందిగా..!

  కాంగ్రెస్ 52 ఏళ్ళ యువ నాయకుడు రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర రోజురోజుకీ నవ్వులపాలవుతోంది. సాధారణంగా ఇటువంటి యాత్రలు చేపట్టేటప్పుడు ఆ పార్టీ యంత్రాంగమంతా ఎంతో పటిష్టంగా పనిచేయాల్సి ఉంటుంది. నాయకుడి స్పీచ్ ల నుంచి సోషల్ మీడియా పోస్టింగ్ ల వరకు ఒక ప్రణాళికాబద్దంగా పనిచేయాలి. ఇందులో ఏ ఒక్క వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోయినా,.. యాత్ర కాస్తా నవ్వులపాలవడం మాత్రం ఖాయం. తాజాగా రాహుల్ గాంధీ యాత్రపై ఆ పార్టీ నాయకులు కావాలని చేసిన తప్పిదాలే.. భారత్ జోడో యాత్రను నవ్వులపాలు చేస్తోంది.

  ఎంత పిండికి అంత రొట్టె అనే సామెత పెద్దలు అప్పుడప్పుడూ చెబుతూ ఉంటారు. అంటే ప్రతిఒక్కరిలో వారికున్న సామర్థ్యాలకు తగినంత మాత్రమే పనిచేయగలుగుతారు. రాహుల్ గాంధీ కూడా అంతే. పేరుకే జాతీయ పార్టీ అప్రకటిత అధ్యక్షుడు. కానీ,.. ఆ స్థాయి నాయకత్వ లక్షణాలు ఏ కోశానా కనిపించవు. అందుకే ప్రధాని నరేంద్రమోదీకి వచ్చినంత జనం రాహుల్ గాంధీ పాదయాత్రలో హాజరవ్వలేకపోతున్నారు. కానీ, ఈ 52 ఏళ్ళ యువ నాయకుడిని ఎలాగైనా దేశ నాయకుడిగా చూపించాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అనివార్యమైపోయింది. దీంతో వారు పడని అవసోపాలు లేవు. పాదయాత్రకు జనం రాకపోయినా డబ్బులిచ్చి తీసుకురావడం నుంచి రాహుల్ గాంధీ చేసే తప్పిదాలను కప్పిపుచ్చేవరకు అన్నిటినీ కవర్ చేయాల్సి వస్తోంది. అయితే ఇది సోషల్ మీడియా కాలం ఎంత కవర్ చేయాలని చూసినా ఎక్కడో ఒకచోట దొరికిపోతారు. ఈ విధంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యే, మధ్యప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ జితేంద్ర పట్వారీ కావాలనే చేసిన చిన్న తప్పిదం వల్ల సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ ను ఎదుర్కొంటున్నారు.

  రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్న సందర్భంగా అక్కడక్కడా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సభలకు ఆశించినంత జనం రావట్లేదు. కిందిస్థాయి నాయకులు జనాన్ని తీసుకురావడానికి ఎంత ప్రయత్నించినా రాహుల్ గాంధీకి ప్రధాని మోదీకున్నంత జనాదరణ లేకపోవడంతో ఆశించినంత స్థాయిలో ప్రజలు రావట్లేదు. అయితే ఆ పార్టీ నాయకులు మాత్రం ఎక్కువ మంది ప్రజలు హాజరవుతున్నారని చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే మధ్యప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ జితేంద్ర పట్వారీ రాహుల్ గాంధీ సభలకు హాజరైన ప్రజలంటూ భారీగా జనమున్న ఓ ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోలో ఇసకేస్తే రాలనంత జనం, కనుచూపుమేరలో ప్రజలే. లక్షలాదిగా హాజరైన ఆ జన సమూహాన్ని చూస్తే.. రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని అనుకుంటారు ఎవరైనా. కానీ, ఎప్పుడూ లేనిది ఇంత జనం ఎక్కడి నుంచి వచ్చారబ్బా..! అనే అనుమానం ప్రతి ఒక్కరిలోనూ తలెత్తింది. రాహుల్ సభకు ఇంత జనం వచ్చినట్టుగా.. ఏ మీడియా ఛానెళ్లూనూ కనీస వార్త కూడా లేదు. ఈ అనుమానమే అసలు నిజాన్ని బయటపెట్టింది.

  అసలే సోషల్ మీడియా యుగం. ప్రతిఒక్కదాన్నీ క్షుణ్ణంగా పరిశీలించి దాని భరతం పట్టే సోషల్ మీడియా యోధులున్న కాలం. దీంతో అసలే ఒక్క కాంగ్రెస్ జెండా కూడా లేని ఆ ఫోటోపై నెటిజన్లకు డౌటొచ్చింది. దీంతో గూగుల్ లో వెదికారు. అక్కడే అసలు నిజం బయటపడింది. జితేంద్ర పట్వారీ షేర్ చేసింది కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రకు సంబంధించిన ఇమేజ్ కాదని.. గూగుల్ తల్లి సాక్ష్యాలతో సహా చెప్పేసింది. ఆ ఫొటే నైజీరియన్లది. 2018లో రీయిన్ హర్డ్ బొన్కే అనే క్రిస్టియన్ మత ప్రచారకుడు.. 2018లో నైజీరియాలో నిర్వహించిన గాస్పెల్ కు దాదాపు 3 కోట్లమంది ప్రజలు హాజరయ్యారు. అదుగో ఆ ఫోటేనే మన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ బాస్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఇదేదో తెలియక చేసిన తప్పిదమనుకుంటే పొరపాటే.. ఆ ఫోటోలోని ఫ్లడ్ లైట్లను ఫోటోషాప్ లో ఎడిటింగ్ చేయించి మరీ.. షేర్ చేయించాడు జితేంద్ర పట్వారీ. రాహుల్ జోడోయాత్రకు ప్రజలు హాజరు కాకపోయినా,.. రాహుల్ గాంధీని జాతీయ నాయకుడి స్థాయిలో చూపించాల్సిన అవసరం ఏర్పడింది కాబట్టి.. ఇలా ఫొటోలు మార్ఫింగ్ చేసి అష్టకష్టాలు పడున్నారు మన కాంగ్రెస్ నాయకులు. ఇలాంటి చిల్లర చేష్టలతో రాహుల్ గాంధీకి జనాదరణ పెరిగడం మాట అటుంచితే.. కాంగ్రెస్‎కు ఉన్న పరువు కాస్తా పోతోంది. ఇప్పటికైనా నాయకులు ఉన్నదున్నట్లు చూపుతారో లేక లేని ప్రజలు వచ్చినట్లు నైజీరియన్లను కాంగ్రెస్ కార్యకర్తలుగా చూపుకుంటారో కాంగ్రెస్ నాయకులకే తెలియాలి.

  Trending Stories

  Related Stories