రంజాన్ నెల ఏప్రిల్ 2 న ప్రారంభమైంది.. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఏప్రిల్ 3 న తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో తన అభిమానులు, అనుచరులకు రంజాన్ నెల శుభాకాంక్షలు తెలిపారు. “అందరికీ రంజాన్ శుభాకాంక్షలు” అంటూ అనుపమ్ ఖేర్ పోస్టు పెట్టారు. “Ramadan Mubarak to all. Love, peace and prayers always,” అంటూ అనుపమ్ ఖేర్ తన ముస్లిం ఫాలోవర్లకు శుభాకాంక్షలు చెప్పగా కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ నిజామీ దూషణలకు దిగారు.
అనుపమ్ ఖేర్ ట్వీట్‌కు ప్రతిస్పందనగా, సల్మాన్ నిజామీ అనుపమ్ ఖేర్ ను “పిరికివాడు, నీచ్, ఇస్లామోఫోబిక్, మతోన్మాది” అనే పదాలతో విమర్శించారు. “Coward, hypocrite, Neech, Islamophobic, bigot, hatemonger. Get lost!” అంటూ సల్మాన్ నిజామీ విమర్శలకు దిగారు.
అనుపమ్ ఖేర్‌ను ఉద్దేశించి కాంగ్రెస్ నేత చేసిన అవమానకరమైన మాటలు అనడం కొత్తేమీ కాదు. గతంలో అనేక సందర్భాల్లో, నిజామీ అనుపమ్ ఖేర్ పై చాలా అసభ్యకరమైన, అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగించారు. గతేడాది ఏప్రిల్‌లో నిజామీ అనుపమ్ ఖేర్ ను ‘రాజకీయ వ్యభిచారి’ అంటూ అవమానించారు. గతంలో చేసిన ట్వీట్ లో “అనుపమ్ ఖేర్ ఒక పొలిటికల్ పింప్ – అతను కశ్మీరీ పండిట్ల శరీరాలపై లాభాలను పొందాడు. ఇప్పుడు కోవిడ్ బాధితులపై కూడా అదే చేయాలని కోరుతున్నారు. పిరికివాడు!” అనే పదజాలాన్ని ఉపయోగించారు నిజామీ.