Telugu States

ఎస్సై కాలర్ పట్టుకున్న రేణుకా చౌదరి

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) వ‌రుస‌గా మూడో రోజు బుధవారం కూడా విచార‌ణ‌కు పిలిచింది. కాంగ్రెస్ శ్రేణులు దేశ వ్యాప్తంగా మూడవరోజు కూడా నిరసనలు కొనసాగిస్తున్నారు. దీంట్లో భాగంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ సీనియర్ నేతల నుంచి యూత్ కాంగ్రెస్ వరకు నిరసనలు చేపట్టారు. ఈ నిరసనల్లో భాగంగా కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ ముట్టడికి యత్నించగా.. పోలీసులు కాంగ్రెస్ నేతలకు అరెస్ట్ లు చేస్తున్నారు.

అయితే కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రేణుకా చౌదరి పోలీసు ఎస్సై కాలర్ పట్టుకున్నారు. నన్ను టచ్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసుల్ని హెచ్చరించారు. మీ స్టేషన్ కు వచ్చి మిమ్మల్ని కొడతానంటూ హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. రేణుకా చౌదరిపై టీఆర్ఎస్ పార్టీ విమర్శలు గుప్పించింది. బీజేపీతో కొట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ ఆస్తులను నాశనం చేస్తున్నారని, పోలీసులపై దాడికి పాల్పడుతున్నారని విమర్శించింది. ఇలాంటి రౌడీలను అరెస్ట్ చేయాలని, వారు చేసిన డ్యామేజీకి వారి నుంచి పరిహారం వసూలు చేయాలని పేర్కొంది. పోలీసులను తిట్టడం, కొట్టడం వంటివి తెలంగాణ కాంగ్రెస్ నేతల మనస్తత్వాన్ని చూపెడుతున్నాయని టీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Related Articles

Back to top button