హై డ్రామా మధ్య ఈడీ విచారణకు హాజరైన రాహుల్ గాంధీ

0
888

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఈడీ విచారణకు హాజరయ్యారు. రాహుల్ గాంధీ విచారణకు హాజరయ్యే ముందు కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీని చేపట్టారు. పీఎంఎల్‌ఏ చట్టంలోని సెక్షన్ 50 ప్రకారం రాహుల్ గాంధీ వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు నమోదు చేస్తారు. అసిస్టెంట్ డైరెక్టర్ ప్రశ్నలు అడుగుతారు.. డిప్యూటీ డైరెక్టర్ ప్రశ్నలను పర్యవేక్షిస్తారు. మరొక అధికారి రాహుల్ వాంగ్మూలాన్ని టైప్ చేస్తారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని 5-6 గంటల పాటు ప్రశ్నించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో విచారణ కోసం రాహుల్ వెళుతుండగా.. ఢిల్లీ వీధుల్లో కాంగ్రెస్ భారీ నిరసన చేపట్టింది. పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

రాహుల్​ గాంధీ ఈనెల 2నే ఈడీ విచారణకు హాజరుకావాల్సింది. కానీ విదేశాల్లో ఉన్న కారణంగా హాజరు కాలేనని రాహుల్ విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఈనెల 13న విచారణకు హాజరవ్వాలని ఈడీ తెలిపింది. దీంతో నేడు విచారణకు హాజరయ్యారు రాహుల్​ గాంధీ.