More

    సర్జికల్ దాడులపై డిగ్గి రాజా కామెంట్స్.. ఆర్మీని అవమానిచ్చినట్లే..!

    భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అసలు సర్జికల్ దాడులే జరగలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్రలో భాగంగా జమ్మూలో జరిగిన బహిరంగసభలో దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. సర్జికల్ దాడులకు ఆధారాలే లేవన్నారు. 2016, 2019లో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై జరిగిన సర్జికల్ దాడులకు సంబందించి మోదీ సర్కారు పార్లమెంట్‌కు ఆధారాలు సమర్పించలేదని దిగ్విజయ్ చెప్పారు. నియంత్రణను రేఖను దాటి పాకిస్థాన్‌‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత బలగాలు జరిపిన సర్జికల్ దాడుల్లో ఉగ్రవాదులను చంపేశామని అబద్ధాలు చెబుతూ పబ్బం గడుపుకుంటున్నారని దిగ్విజయ్ కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. దేశ ప్రజలంతా ముందుకొచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని దిగ్విజయ్ కోరారు.

    ఇక ఇదే సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాల్సిందేనని.. జమ్మూకశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని రాహుల్ హామీ ఇచ్చారు. తన యాత్రలో ఎంతో మంది ప్రజలతో మాట్లాడానని వారు తమ సమస్యలను లేవనెత్తారని ఆయన చెప్పారు. పాలనా యంత్రాంగం తమ గొంతు వినడం లేదని వారు తనతో చెప్పారని అన్నారు. మొత్తం వ్యాపారాన్ని బయటి వ్యక్తులు నడుపుతున్నారని, జమ్మూకశ్మీర్ ప్రజలు నిస్సహాయంగా కూర్చొని చూస్తున్నారని ఆయన అన్నారు. జమ్మూకశ్మీర్‌లో దేశంలోనే అత్యధిక నిరుద్యోగం ఉందని యువకులు ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు కావాలని ఆకాంక్షిస్తున్నారని అన్నారు.

    Trending Stories

    Related Stories