National

శివసేనకు షాక్ ఇవ్వబోతున్న కాంగ్రెస్..?

ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. శివసేన ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఉద్దవ్ ఠాక్రే సమావేశమయ్యాక.. ముర్ముకే మద్దతు ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకుందని అన్నారు. రాష్ట్రపతి అభ్యర్థి గిరిజన మహిళ కావడంతో ద్రౌపది ముర్ముకే శివసేన మొగ్గు చూపింది. మొత్తం 22 ఎంపీలకు గాను 16 మంది సభ్యులు షిండే వర్గంలో ఉన్నారు. మిగిలిన వారు ఠాక్రే వైపు ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీఏ అభ్యర్థికే శివసేన మద్దతు ఇస్తున్న విషయాన్ని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు.

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు శివసేన మద్దతు ప్రకటించడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోంది. కూటమి ధర్మాన్ని అతిక్రమిస్తే అందులోంచి బయటకు వచ్చేందుకు తాము సిద్ధమని కాంగ్రెస్ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. దీంతో మహావికాస్ అఘాడీ కూటమిలో చీలిక ఏర్పడొచ్చని అంటున్నారు. కూటమిలోని భాగస్వామ్య పక్షాలను సంప్రదించకుండా రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు విషయంలో నిర్ణయం ఎలా తీసుకుంటారని కాంగ్రెస్ సీనియర్ నేత బాలాసాహెబ్ థోరట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శివసేన తీరు ఇతర పార్టీలకు ప్రయోజనం చేకూరేలా ఉందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. కూటమి ధర్మాన్ని అతిక్రమిస్తే ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధమని అంటున్నారు.

Related Articles

Back to top button