ప్రియాంక గాంధీ వాద్రా అధికారికంగా రాజకీయాల్లోకి వచ్చి ఉత్తరప్రదేశ్‌పై దృష్టి పెట్టడం ప్రారంభించినప్పుడు, కాంగ్రెస్‌కు వారి కుటుంబ కంచుకోటలైన అమేథీ, రాయ్‌బరేలీ నుండి 2 ఎంపీలు మరియు 2 ఎమ్మెల్యేలు ఉండేవారు. కేవలం 3 సంవత్సరాల లోనే ఆ సంఖ్య కేవలం 1కి చేరుకుంది. కేవలం రాయ్ బరేలీ ఎంపీగా సోనియా గాంధీ కొనసాగుతూ ఉన్నారు. ఆమె ఎంపీగా ఉన్న ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ స్థానాల్లో ఎటువంటి ప్రభావం కూడా కాంగ్రెస్ చూపలేకపోయింది.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రియాంక వాద్రా ఏదైనా మ్యాజిక్ చేస్తుందని ఎవరూ ఊహించనప్పటికీ, కొందరు భారతీయ జర్నలిస్టులు ఇప్పటికీ ప్రియాంకను యూపీ పాలిటిక్స్‌లో సీరియస్ నేతగా ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ, వారి కుటుంబ కంచుకోటలలో కూలిపోయింది. వారసత్వ రాజకీయాలకు ప్రజలు పెద్ద పీఠ వేయడం లేదని ఈ ఫలితాలే నిదర్శనం.
గత కొద్ది సంవత్సరాలుగా ఉత్తరప్రదేశ్ అంతటా కాంగ్రెస్ వెనుకబడుతూనే ఉంది. నెహ్రూ-గాంధీ రాజవంశం పేరుతో ఓట్లను ఆకర్షించగలిగే ఈ రెండు కుటుంబ కంచుకోటలు వారికి ఇప్పటికీ ఉన్నాయి. 2019లో హోరాహోరీగా జరిగిన ఎన్నికలలో స్మృతి ఇరానీ రాహుల్ గాంధీని ఓడించినప్పుడు వారికి పెద్ద షాక్ తగిలింది. అక్కడ ఓటమిని ముందుగానే పసిగట్టిన రాహుల్ గాంధీ తన రెండవ ఎంపికగా వాయనాడ్‌లో సురక్షితమైన సీటుకు వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎన్నికలలో కొనసాగుతున్న ట్రెండ్‌తో, 2024లో సోనియా గాంధీ కూడా తాను గెలవగలిగే ఇంకో సీటును కనుగొనవలసి ఉంటుంది.
2017లో కాంగ్రెస్ టికెట్ పై రాయ్‌బరేలీలో గెలుపొందిన అదితి సింగ్.. బీజేపీ టికెట్ పై పోటీ చేసి ఇప్పుడు కూడా గెలుపొందడం విశేషం. 2020లో కాంగ్రెస్ ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేసింది, ఇప్పుడు బిజెపి టికెట్ పై పోటీ చేసి కాంగ్రెస్‌ను ఓడించింది. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ బాధ్యతలను స్వీకరించిన ప్రియాంక గాంధీ వాద్రా ఆ పార్టీని గట్టిగానే ముంచేసిందని అంటున్నారు.