More

    లైంగిక వేధింపుల కేసులో పోలీసులకు ఎట్టకేలకు చిక్కిన కాంగ్రెస్ కౌన్సిలర్‌

    కన్నూర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కౌన్సిలర్‌ పివి కృష్ణ కుమార్ ను లైంగిక వేధింపుల కేసులో కేరళ పోలీసుల బృందం అరెస్టు చేసింది. కన్నూర్‌లోని కాంగ్రెస్ నియంత్రణలో ఉన్న బ్యాంక్ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పివి కృష్ణ కుమార్‌ను అరెస్టు చేశారు. కన్నూర్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ అధికారంలో ఉంది. పివి కృష్ణ కుమార్ లైంగిక వేధింపులకుపాల్పడినట్లు ఉద్యోగి పేర్కొంది. అందుకు సంబంధించి జూలై 20 న ఫిర్యాదు చేశారు. ఈ ఘటన జరిగినప్పుడు కార్యాలయంలో తాను ఒంటరిగా ఉన్నానని ఆమె ఆరోపించింది. బ్యాంకులోని సీసీటీవీ విజువల్స్‌ను పరిశీలించిన తర్వాత ఎడక్కాడ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అప్పటి నుండి పివి కృష్ణన్ కుమార్ పరారీలో ఉన్నారు. తలస్సేరి అసిస్టెంట్ మున్సిపల్ పోలీస్ కమిషనర్ టికె రత్నకుమార్ నేతృత్వంలోని అధికారులు నిందితుడిని పట్టుకున్నారు. నివేదిక ప్రకారం, కృష్ణ కుమార్ ముందస్తు బెయిల్ దరఖాస్తును తలస్సేరి సెషన్స్ కోర్టు ఇప్పటికే తిరస్కరించింది.

    “కన్నూరు కౌన్సిలర్ పివి కృష్ణ కుమార్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. నిందితుడు పరారీలో ఉన్నాడు. కేరళ, పొరుగు రాష్ట్రాల్లో అతడి గురించి వెతికాం. బెంగళూరులో అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరుస్తాము” అని కన్నూర్ సీపీ ఆర్.ఇళంగో ధృవీకరించారు. ఫిర్యాదు కారణంగా కన్నూర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కృష్ణ కుమార్‌ను సస్పెండ్ చేసింది.

    spot_img

    Trending Stories

    Related Stories