More

  జిగ్నేష్ మేవానీ.. హవ్వ.. ఇదేం పని..?

  జిగ్నేష్ మేవానీ.. ఈ పేరు గుర్తుంది కదా..! JNU గొడవల సమయంలో ప్రముఖంగా వినిపించిన పేరిది. దళిత జనోద్ధారకుడిగా, పేదల పక్షపాతిగా లౌకిక మేధావిగా ఈయను ఓ వర్గం మీడియా కొనియాడుతూ ఉంటుంది. గుజరాత్ కు చెందిన ఈ ఎమ్మెల్యే గారు నీతికి, నిజాయితీ మారు పేరుగా ప్రొజెక్టు చేసుకుంటారు. కానీ, ఈ ఎన్నికల్లో ఆయన ఏం చేస్తున్నారో తెలుసా..? వివాదాస్పద రీతిలో ప్రజల నుంచి సొమ్ము వసూలు చేస్తున్నాడు. ప్రస్తుతం గుజారాత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తున్నాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఎన్నికల్లో గెలవటం కోసం చాలామంది గెలుపొందిన ఎమ్మెల్యేలు అవినీతి చేస్తారన్నాడు. కానీ తనలాంటి అవినీతి రహితులకు ఎన్నికల్లో పోటీ చేయడానికి డబ్బుల్లేవనీ,.. బీజేపీ లాంటి పార్టీని ఎదుర్కోవడానికి తనకు డబ్బులు అవసరమవుతాయని చెప్పుకొచ్చాడు. అందుకే తాను మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ట్విట్టర్ లో ఇచ్చిన లింక్ ను క్లిక్ చేసి విరాళాలందించాలని కోరాడు. అయితే విరాళాలు అందించడానికి చేసిన వీడియోలో మాత్రం డ్రామాను రక్తి కట్టించినా,.. దీనికి ఉపయోగించిన క్రౌడ్ ఫండింగ్ ఫ్లాట్ ఫామ్ తీవ్ర వివాదానికి దారితీసింది. గతంలో కూడా ఈ ఫ్లాట్ ఫామ్ కోఫౌండర్ JNU అల్లర్లలో పాలుపంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫ్లాట్ ఫామ్ చుట్టూ ఉన్న వివాదాల గురించి తెలుసుకునేందుకు ముందు.. నేషనలిస్ట్ హబ్ గ్రూపాఫ్ ఛానెల్స్ ను సబ్ స్క్రయిబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి.. పదిమందికీ షేర్ చేయండి.

  జిగ్నేష్ మేవానీ ఉపయోగించిన ‘అవర్ డెమోక్రసీ’ అనే క్రౌడ్ ఫండింగ్ ఫ్లాట్ పామ్ ను కేవలం ఉదారవాదులు మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ క్రౌడ్ ఫండింగ్ కో ఫౌండర్ ఆనంద్ మంగ్నేల్ 2020 లో ఢిల్లీ JNI లో జరిగిన అల్లర్లలో ఇతడిది కూడా ఒక పాత్ర అని ఓపీ ఇండియా అనే పత్రిక కథనం ద్వారా తెలుస్తోంది. యూనివర్శిటీ అల్లర్లలో ఆనంద్ మంగ్నేల్ చురుగ్గా పాల్గొన్నాడని అర్థమవుతోంది. అల్లరి మూకల గుంపును ఏకం చేయడానికి ఆనంద్ మంగ్నేల్ వాట్సాప్ గ్రూపులను కూడా ఉపయోగించినట్లు వెల్లడైంది. అయితే ఇటువంటి వ్యక్తుల చేతిలో నడపబడుతున్న క్రౌడ్ ఫండింగ్ ఫ్లాట్ ఫామ్ నే ఉపయోగించడం వెనుక పలువురు నిపుణులు ఎన్నో అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

  ఇలాంటి క్రౌడ్ ఫండింగ్ ఫ్లాట్ ఫాంల వల్ల అవకతవకలు జరిగే అవకాశముందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆన్లైన్ నుంచి వచ్చే క్రౌడ్ ఫండింగ్ ను మానిప్యులేట్ చేసి తక్కువగా వచ్చినట్లు చూపడానికి అవకాశముంటుందనీ అందుకే లెష్టిస్ట్‏లందరూ ఉపయోగించే క్రౌడ్ ఫ్లాట్ ఫాంనే జిగ్నేష్ మేవానీ కూడా ఉపయోగించాడని అంటున్నారు. అవర్ డెమోక్రసీ ఫ్లాట్ ఫాం కో ఫౌండర్ కు జిగ్నేష్ మేవానీకి దగ్గరి సంబంధాలుండటంతో ఈ ఫండింగ్ లో అవకతవకలు జరిగేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందనీ,.. దీనిపై ప్రభుత్వం మరింత దృష్టి సారించాలనీ పలువురు కోరుతున్నారు. ఇక ఈ క్రౌడ్ ఫండింగ్ లో డొనేట్ చేసిన వ్యక్తుల లిస్టును ఒక్కసారి పరిశీలిస్తే ఇందులో తీస్తా సెతల్వాద్ అనే పేరు బయటపడింది. కొద్దిరోజుల క్రితం వరకు వార్తల్లో ప్రముఖంగా వినిపించిన తీస్తా సెతల్వాద్ ఎవరో మీకు ఇప్పటికే అర్థమైవుంటుంది. ఒకప్పుడు గుజరాత్ అల్లర్లలో మోదీని ఇరికించడానికి ఫేక్ పత్రాలను సృష్టించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తే ఈ తీస్తా సెతల్వాద్. మోదీపై అసత్య ఆరోపణలతో కుట్రపూరితంగా ఇరికించడానికి ప్రభుత్వాధికారులతో విఫలయత్నం చేసింది. అయితే తర్వాత సుప్రీం కోర్టు ఈమె చేసిన ఘనకార్యాలను గుర్తించి తీవ్రంగా తప్పుబట్టింది. దీంతో గుజరాత్ పోలీసులు ఆమెను అరెస్టు చేసి విచారణ చేపడుతున్నారు. అయితే ఈ పేరు ఆమెదే అన్న దానిపై స్పష్టత లేకపోయినా,.. జిగ్నేష్ మేవానీతో ఆమెకు సత్సంబంధాలున్న నేపథ్యంలో ఆమె తీస్తా సెతల్వాద్ అనే పలువురు భావిస్తున్నారు.

  ఇక ఈ ఫ్లాట్ ఫాం ద్వారా జిగ్నేష్ మేవానీ దాదాపు 40 లక్షల వరకు డబ్బులను సమకూర్చుకోవాలనే లక్ష్యంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ లక్ష్యంలో భాగంగా మరిన్ని ఎక్కువ విరాళాలు వచ్చినా కూడా.. వీటిని మానిప్యులేట్ చేసే భాగంలో ఏదైనా అవక తవకలకు పాల్పడకుండా అధికారులు ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉంది.

  Trending Stories

  Related Stories