More

  మహాభారతంలో జీహాద్..?! ఇది కాంగ్రెస్ ‘మార్కు’ గీతోపదేశం..!

  మహాభారతంలో జీహాద్ ఉందట. గీతలో అర్జునుడికి ఉపదేశించిందంతా జీహాదేనట. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో గల్లీ లీడర్ కాదు. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర హోం మంత్రిగా పదవి వెలగబెట్టిన శివరాజ్ సింగ్ పాటిల్. దీంతో ఈ కాంగ్రెస్ వృద్ధ నేతపై హిందూ సమాజం భగ్గుమంటోంది. వివాదాస్పద వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం చెలరేగుతోంది. ధర్మబద్దమైన, పవిత్రమైన గీతోపదేశాన్ని జీహాద్‎తో పోలుస్తారా..? ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  కాంగ్రెస్ నేత మొహ్సినా కిద్వాయి జీవిత చరిత్రపై రాసిన పుస్తకాన్ని విడుదల చేసే కార్యక్రమంలో.. శివరాజ్ సింగ్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇస్లాంలో జీహాద్ పై ఎన్నో చర్చలు జరుగుతున్నాయన్నారు. తాము ఎంపీలుగా ఉన్నప్పుడు కూడా భారత పార్లమెంటులో జీహాద్ పై కాకుండా భావజాలంపై పోరాడామని చెప్పుకొచ్చారు. జీహాద్ కేవలం ఇస్లాంలో మాత్రమే లేదని.. ఇది హిందువుల ఆరాధ్య గ్రంథమైన గీతలో కూడా ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి జిహాద్ నే బోధించాడని వక్రభాష్యం చెప్పుకొచ్చారు. ఈ విధమైన జీహాదీ భావజాలానికి తాము వ్యతిరేకంగా పోరాడుతున్నామని సెలవిచ్చారు. దీంతో హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. పవిత్రమైన భగవద్గీతను జిహాద్ తో పోలుస్తావా అంటూ మండిపడుతున్నారు. అయితే నిజంగా గీతలో ఉన్నది జిహాద్ మాటలేనా..? జిహాద్ కు గీతకు ఉన్న తేడా ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  మహాభారతంలో శ్రీ కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తాడు. ధర్మం దారితప్పినప్పుడు తిరిగి గాడిలో పెట్టడానికి పాండవులు కౌరవుల మధ్య యుద్దం జరుగుతుంది. అయితే, ఈ యుద్దంలో అర్జునుడికి గురువులు, మిత్రులు, బంధువులు సమస్తం అందరూ కౌరవుల తరపునే పోరాడటానికి సిద్దమవుతారు. దీంతో వీరందరినీ చూసి అర్జునుడు యుద్దం చేయడానికి వెనక్కు తగ్గుతాడు. దీంతో శ్రీ కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తాడు. ధర్మం తప్పిన రాజులను సంహరించి.. ధర్మ సంస్థాపనకు పూనుకోమని కురుక్షేత్రంలో శ్రీ కృష్ణుడు హితబోధ చేస్తాడు. దీంతో అర్జునుడు కౌరవులతో యుద్దం చేసి ధర్మాన్ని పున:స్థాపన చేస్తాడు. ఇది ఏ మతానికి చెందినది కాదు. ధర్మం తప్పినవారికి వ్యతిరేకంగా చేసిన యుద్దమే కురుక్షేత్రం.

  అయితే జిహాద్ ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. జిహాద్ పేరిట కొందరు ఉన్మాదులు అమాయక ప్రజల ప్రాణాలను తీసేస్తారు. ఉగ్రవాద సంస్థలు ఇస్లామిక్ రాజ్యాల ఏర్పాటు కోసం జిహాద్ ను ఒక సాకుగా ఉపయోగిస్తున్నాయి. అందుకే ఇస్లాం పుట్టిన సౌదీ కూడా యెమెన్ లోని హౌతీ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతోంది. అదే సమయంలో గీతా సారాంశాన్ని ప్రపంచదేశాలన్నీ స్వాగతిస్తున్నాయి. జీవితంలో తీవ్ర నిరాశా నిస్ప్రుహల్లో మునిగిపోయిన వారందరూ భగవద్గీతను చదివితే నిరాశను పారద్రోలేంత శక్తిని సంపాదిస్తారు. ఇప్పటికీ ప్రపంచంలోని పేరొందిన ఫిలాసఫర్లందరూ గీతను చదవమని సిఫార్సు చేస్తారు. అరబ్ దేశాల్లో కూడా పిల్లలకు గీతా సారాంశాన్ని పాఠ్యాంశంగా బోధిస్తున్నారు. ఇంతటి ప్రాశస్త్యం పొందిన భగవద్గీతను ఎస్ పాటిల్ జిహాద్ ఉన్మాదంతో పోల్చడంతో తీవ్ర దుమారం చెలరేగింది.

  దేశ మాజీ హోంమంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ప్రపంచానికి ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఇది కేవలం పాటిల్ మాత్రమే కాదని పూర్తి కాంగ్రెస్ డీఎన్ఏ లోనే హిందూ వ్యతిరేకత దాగి ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో కూడా ట్వంటీ సిక్స్ బై లెవెన్ ఉగ్రవాద దాడుల్లో హిందూ ఉగ్రవాదం అనే పదాన్ని కాంగ్రెస్ నాయకులు తీసుకొచ్చే ప్రయత్నం చేశారని పలువురు గుర్తు చేస్తున్నారు. తాజాగా భగవద్గీతలో కూడా జిహాదీ ఉగ్రవాదాన్ని జొప్పించే ప్రయత్నం చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఇకనైనా ఎస్ పాటిల్ హిందువులకు క్షమాపణలు కోరుతారో లేక తమకు ఇవన్నీ షరా మామూలే అనుకుని వదిలేస్తారో వేచి చూడాల్సిందే..

  Trending Stories

  Related Stories