ఆత్మహత్య చేసుకున్న విజయ్ ఆంటోనీ కుమార్తె

0
56

విజయ్ ఆంటోనీ.. పరిచయం అక్కర్లేని పేరు. బిచ్చగాడు సినిమాతో భారీ పాపులారిటీని దక్కించుకున్నాడు విజయ్ ఆంటోనీ. విభిన్న కథలతో అలరించే విజయ్ ఆంటోనీ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. విజయ్ ఆంటోని కుమార్తె మీరా సెప్టెంబర్ 19 తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది. ఆమె వయస్సు 16 సంవత్సరాలు. మీరా చెన్నై నివాసంలో ఉరివేసుకుని కనిపించడంతో ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ప్రకటించారు. నివేదికల ప్రకారం, ఆమె డిప్రెషన్ లో ఉంది.. అందుకోసం ఆమె చికిత్స తీసుకుంటూ ఉందని తెలుస్తోంది.

విజయ్ ఆంటోని తన సినిమా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. అతని కొత్త చిత్రం ‘రథం’ విడుదలకు సిద్ధమవుతూ ఉంది. ఇటీవల ఆయన చెన్నైలో నిర్వహించిన మ్యూజిక్ కాన్సర్ట్ కు భారీ స్పందన వచ్చింది. సెప్టెంబర్ 19న, విజయ్ ఆంటోనీ, అతని కుటుంబం ఊహించని విషాదంలో ఉండిపోయింది. చెన్నైలోని అల్వార్‌పేట్‌లోని ఆయన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు మీరా శవమై కనిపించడంతో తీవ్ర షాక్‌కు గురయ్యారు. ఆమె వయస్సు 16 సంవత్సరాలు. ఆమె చెన్నైలోని ప్రముఖ పాఠశాలలో చదువుతోంది. ఆ బాలిక డిప్రెషన్‌తో పోరాడుతున్నట్లు తమిళ మీడియా సంస్థలు తెలిపాయి. ఆమె గదిలో ఉరి వేసుకుని కనిపించడంతో మీరాను చెన్నైలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమెను పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

విజయ్ ఆంటోనికి 2006 పెళ్లయింది. ఫాతిమా అనే మహిళను ఆయన వివాహం చేసుకున్నాడు. వీరికి కుమార్తె లారా, కుమారుడు ఉన్నారు. లారా మరణ వార్త విని సినీ ప్రముఖులు, లారా స్నేహితులు సంతాపాన్ని ప్రకటించారు. సంగీత దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన విజయ్ ఆంటోనీ ఆ తర్వాత హీరోగా మారారు. నిర్మాత, దర్శకుడిగా కూడా ఆయన సక్సెస్ ను అందుకున్నారు.