మా ఎన్నికలకు దగ్గర పడుతూ ఉండడంతో ప్యానల్స్ మధ్య ఆరోపణలు కూడా మొదలయ్యాయి. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానల్ ను ప్రకటించగా.. ఈరోజు మంచు విష్ణు తన ప్యానల్ ను ప్రకటించారు. మంచు విష్ణు – అధ్యక్షుడు, రఘుబాబు – జనరల్ సెక్రటరీ, బాబు మోహన్ – ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, మధాల రవి – వైస్ ప్రెసిడెంట్, పృథ్వీరాజ్ బాలిరెడ్డి – వైస్ ప్రెసిడెంట్ , శివబాలాజీ – కోశాధికారి కరాటే కల్యాణి -జాయింట్ సెక్రటరీ, గౌతమ్ రాజు-జాయింట్ సెక్రటరీగా పోటీ చేస్తుండగా.. అర్చన, అశోక్‌కుమార్, గీతాసింగ్, హరినాథ్‌బాబు, జయవాణి, మలక్‌పేట్ శైలజ, మాణిక్, పూజిత, రాజేశ్వరీ రెడ్డి, సంపూర్ణేశ్ బాబు, శశాంక్, శివన్నారాయణ, శ్రీలక్ష్మి, శ్రీనివాసులు, స్వప్నా మాధురి, విష్ణు బొప్పన, వడ్లపట్ల ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా పోటీ చేస్తున్నారు.
మంచు విష్ణు ప్యానల్ పై ప్రస్తుత మా అద్యక్షుడు స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేశారు. నరేష్ మాట్లాడుతూ విష్ణును అభినందించాడు. మంచు విష్ణు ప్యానల్ బాగుందని ఫ్రెష్ గా ఉందని అన్నారు. కాంట్రవర్షియల్ సభ్యులు ఎవరూ లేరని అన్నారు. ముఖ్యంగా అన్ని ప్రాంతాల వారికీ ప్రాముఖ్యత ఇచ్చారని.. మహిళలకు ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. ఎన్నికలలో విష్ణు విజయం సాధించాలను కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఇక జీవితపై చర్యలు తీసుకోవాలంటూ నటుడు పృథ్వీరాజ్ ఎన్నికల ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. జీవిత ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్నారు. జీవిత తనకు ఓటు వేస్తేనే లాభాలు ఉన్నాయి అంటూ కొందరిని మభ్య పెడుతున్నారని, నిబంధనల ప్రకారం ఆమెపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల ఆఫీసర్‌కు ఆయన లేఖ రాశారు. ఇదే విషయమై బండ్ల గణేష్ కూడా జీవితపై ఫిర్యాదు చేశారు.
అక్టోబర్ 10 ఆదివారం నాడు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో మా అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 27 నుంచి 29 వరకు నామినేషన్లు స్వీకరణ చేపట్టి 30న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ ఉపసంహరణకు వచ్చే నెల 1, 2 తేదీల్లో సాయంత్రం 5 గంటల వరకు గడువు విధించారు. 2వ తేది సాయంత్రం 5 గంటల తర్వాత అంతిమంగా మా ఎన్నికల రేసులో నిలిచిన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. అక్టోబర్ 10న ఎన్నికలు జరగనుండగా అదే రోజు రాత్రి 7 గంటలకు ఫలితాలు వెల్లడి కానున్నాయి.