More

    ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడి.. పోలీసులకు ఫిర్యాదు

    ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత తలెత్తింది. ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ నేతలు బంజారా హిల్స్ పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం ఎదుట భారీగా పోలీసులు మోహరించారు. ఎంపీ అరవింద్ ఇంటిపై దాడిని నిరసిస్తూ BJYM కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

    బీజేపీ ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడిని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఖండించారు. అర్వింద్ ఇంటిపై దాడి చేసింది తెలంగాణ వ్యతిరేకులేనని.. పోలీసుల సహాయంతో టీఆర్ఎస్ గుండాలు అర్వింద్ ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు. సమయం వచ్చినప్పుడు టీఆర్ఎస్ కు, కేసీఆర్ కు సరైన గుణపాఠం చెబుతామన్నారు. అర్వింద్ ఇంటిపై దాడికి నిరసనగా బీజేపీ కార్యకర్తలు తెలంగాణ భవన్ ముట్టడికి బయల్దేరగా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. బీజేవైఎం కార్యకర్తలు ప్రగతి భవన్ ను ముట్టడికి బయల్దేరడంతో పోలీసులు,బీజేవైఎం కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

    Trending Stories

    Related Stories