More

    ఆ దుస్తులు వేసుకొని లక్ష్మిదేవి లాకెట్ ధరించిన నటి తాప్సీ.. కేసు పెట్టిన హిందూ సంఘాలు..!

    సినీ నటి తాప్సీ పన్నుపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. హిందూ దేవుళ్లను కించపరిచారని.. అంతేకాకుండా అశ్లీలతను వ్యాప్తి చేశారని పేర్కొంటూ హింద్ రక్షక్ సంఘటన్ తాప్సీపై ఫిర్యాదు చేసింది. అసభ్యకరమైన దుస్తులు వేసుకున్న ఆమె మెడలో లక్ష్మీదేవి లాకెట్ ఉంది. ఆమె లక్ష్మీదేవి శిల్పంతో కూడిన హారాన్ని ధరించి అసభ్యకరమైన దుస్తులను ధరించి హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని ఫిర్యాదు నమోదు చేశారు. మార్చి 12న ముంబైలో జరిగిన ఫ్యాషన్ షో లో పాల్గొన్న తాప్సీ.. ర్యాంప్ వాక్ చేస్తున్న సమయంలో ఆమె వేసుకున్న దుస్తులు అసభ్యకరంగా ఉన్నాయంటూ ఇప్పటికే కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.

    సినీ నటి తాప్పీపై బీజేపీ ఎమ్మెల్యే మాలినీ గౌర్ కుమారుడు, హింద్ రక్షక్ సంఘటన్ కన్వీనర్ ఏకలవ్య గౌర్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. మార్చి 12న ముంబైలో లాక్మే ఫ్యాషన్ వీక్‌లో తాప్సీ ర్యాంప్ వాక్‌లో పాల్గొన్నారని, అందులో భాగంగా ఆమె అసభ్యకరమైన దుస్తులు ధరించారని ఆరోపించారు. లక్ష్మీ దేవి లాకెట్ ను ధరించి హిందూ దేవుళ్లను అవమానించారని, లక్ష్మీ దేవిని కించపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వివాదంపై తాప్సీ ఇంకా స్పందించలేదు.

    Trending Stories

    Related Stories