Just Asking

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అసలు మోటివ్ ఏంటో తెలుసా?

IMA-ఇండియన్ మెడికల్ అసోసియేషన్. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ మధ్య ఈ పేరు తరచూ వినిపిస్తోంది. IMAకి నేతృత్వం వహిస్తున్న వ్యక్తులు చేస్తున్న వ్యాఖ్యల్ని పత్రికలు, మీడియా ఛానళ్లు చాలా విశ్వసనీయమైనవిగా ప్రచారం చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసలు IMA కార్యకలాపాలపై వస్తున్న ఆరోపణలు, దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తుల వ్యక్తిగత లక్ష్యాలు..! ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విశ్వసనీయతనే ప్రశ్నార్థకం చేస్తున్న అంశాలను నేను మీకు ఇప్పుడు వివరిస్తాను.

ప్రధాని నరేంద్రమోదీని కరోనా సూపర్ స్ప్రెడర్ అంటూ జాన్ రోస్ జయలాల్ నేతృత్వం వహిస్తున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ మధ్య ఆరోపించింది. అలాగే దేశంలో ఇంగ్లీష్ అల్లోపతి వైద్యవిధానాన్ని సవాల్ చేస్తున్న యోగా గురు రాందేవ్ బాబాను.., ఇప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ టార్గెట్ చేసింది.

నిజానికి కోవిడ్ చికిత్స పేరుతో అల్లోపతి డాక్టర్లు వ్యవహరిస్తున్న తీరును రాందేవ్ బాబా ప్రశ్నించారు. మొదట హైడ్రాక్సిక్లోరోక్విన్ అన్నారని. అది విఫలమైందని, ఆ తర్వాత రెమిడెసివిర్ అన్నారని. అదీ విఫలమైందని. ఇప్పుడు ప్లాస్మా థెరపీని సైతం నిషేధించారని., స్టెరాయిడ్స్, ఫ్యాబిప్లూ, ఐవర్ మెక్టిన్ కూడా విఫలం అయ్యాయని.. , ఇలా అల్లోపతి వైద్యవిధాన సామర్థ్యాన్ని రాందేవ్ బాబా ప్రశ్నించడం జరిగింది.

అయితే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ ఈ వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు. ఆయన రాందేవ్ బాబాకు స్వయంగా లేఖ రాయడంతో… తాను ఆధునిక మెడికల్ సైన్స్ ను, అల్లోపతిని వ్యతిరేకించడం లేదని, శస్త్ర చికిత్స, ప్రాణ రక్షణ వ్యవస్థలో అల్లోపతి బాగా ప్రగతిని సాధించిందని, తన వ్యాఖ్యలు ఎవరి మనోభావాలనైనా గాయపరిచి ఉంటే క్షమించండి అంటూ రాందేవ్ బాబా. వివాదానికే  ముంగింపు పలికే ప్రయత్నం చేశారు.  

అయితే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంతటితో ఆగలేదు. తమ ఉత్తరాఖండ్ శాఖ తో రాందేవ్ బాబాపై ఏకంగా వెయ్యి కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేయించింది. లీగల్ నోటీసులు పంపించింది. దీంతోపాటు రాందేవ్ బాబాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోదీకి, అలాగే ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ రావత్ కు లేఖలు రాసింది.

తాను అల్లోపతి వైద్యవిధానాన్ని గౌరవిస్తున్నానని, అలాగే మానవ ఆరోగ్యానికి ఆ వైద్యమొక్కటే శరణ్యం కాదని, భారత్ లో పూర్వకాలం నుంచి ఆయుర్వేదంతోపాటు ఎన్నో చికిత్స పద్దతులు ఉన్నాయని మాత్రమే చెప్పానని.., అయినా కూడా తనను టార్గెట్ చేస్తూ ఐఎంఐ అదేపనిగా విమర్శలు గుప్పిస్తుండటంతో.., రాందేవ్ బాబా తిరిగి కౌంటర్ అటాక్ ను మొదలు పెట్టారు. తనపై రాజద్రోహం కేసు నమోదు చేయాలన్న ఐఎంఏ డిమాండ్ పై రాందేవ్ బాబా ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను అరెస్టు చేయించే దమ్ము, ధైర్యం ఐఎంఏకు లేవన్నారు. అలాగే బీపీ, షూగర్, అస్తమా, థైరాయిడ్, అర్థరైటిస్, వంటి వ్యాధులకు ఎందుకని అల్లోపతిలో శాశ్వత చికిత్సలు లేవంటూ రాందేవ్ బాబా 25 ప్రశ్నలు సంధించారు. అల్లోపతి వైద్యవిధానంలోని లూప్ హోల్స్ కూడా చర్చించాలని అన్నారు.  అయితే రాందేవ్ బాబా లేవనెత్తిన 25 ప్రశ్నలకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇంత వరకు సమాధానం ఇవ్వలేదు. కానీ రాష్ట్రాలవారిగా తమ అసోసియేషన్ శాఖల ద్వారా రాందేవ్ బాబాపై వరుసగా ఫిర్యాదులు చేయడం మాత్రం ఆపడం లేదు. మరోవైపు ఇదే సమయంలో రాజస్థాన్ లోని రాందేవ్ బాబా సొంత కంపెనీ పంతంజలికి చెందిన ఓ ఫ్యాక్టరీలో ఆ రాష్ట్ర పోలీసులు సోదాలు నిర్వహించడంతో ఈ వివాదం రాబోయే రోజుల్లో రాజకీయ మలుపు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

మొదట ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భారత ప్రధాని నరేంద్ర మోదీని సూపర్ స్ప్రెడర్ అంటూ టార్గెట్ చేయడం,  ఇప్పుడు రాందేవ్ బాబా లక్ష్యంగా విమర్శలు గుప్పించడం, లీగల్ నోటిసులు పంపించడం, వెనుక… ఐఎంఏ అధ్యక్షుడి అసలు మోటివ్ వేరే ఉందని కొంతమంది విశ్లేషకులు అనుమానిస్తున్నారు.

ప్రభుత్వపరంగా నామ్ కే వాస్తేగా ఉన్న ఆయుర్వేద విభాగాన్ని… కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే బలోపేతం చేయడం జరిగింది. భారతీయ సంప్రదాయ వైద్యవిధానాలైన ఆయుర్వేదం, యోగా, ప్రకృతి వైద్యం, యునాని, సిద్ధ వైద్యంతోపాటు హోమియోపతి విధానాన్ని ఒక్కటిగా కలిపి ప్రత్యేకంగా ఆయుష్ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసింది. అలాగే  దాదాపు 35 రకాల సాధారణ సర్జరీలకు సైతం ఆయుర్వేద వైద్యులకు అనుమతినిచ్చింది.

అయితే ఆయుర్వేద వైద్యులకు సాధారణ సర్జరీలకు అనుమతించడాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకించింది. దీనిని మిక్సోపతి అని ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ జాన్ రోస్ జయలాల్ వ్యతిరేకించాడు. దేశ వ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద డాక్టర్ల చేత 15 రోజులపాటు నిరసన ప్రదర్శనలు చేయించారు. ఆయుర్వేద వైద్యవిధానానికి వ్యతిరేకంగా ఇంటర్వ్యూలు, ఉపన్యాసాలు, సెమినార్లు నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతూ క్యాచీ స్లోగన్స్ తో వాల్ పోస్టర్ పోటీలు నిర్వహించి…మోదీ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను మరింతగా రెచ్చగొట్టారు జాన్ జయలాల్! అంతేకాదు ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల పేరుతో జరుగుతున్న సోకాల్డ్ నిరసన ప్రదర్శనలకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడి హోదాలో సైతం మద్దతు తెలిపారు. 

నిజానికి డాక్టర్ జాన్ జయలాల్ భారతీయ సనాతన ధర్మ వ్యతిరేకి అని ఆయన చేతలు, మాటలను చూస్తే స్పష్టమైపోతుంది.  క్రైస్తవ మిషనరీలు నడిపే క్రిస్టియన్ టూడే పత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయుర్వేదం, సంస్కృతం భాషలపై తన అక్కసును వెల్లగక్కాడు జాన్ జయలాల్. సంస్కృత భాష ద్వారా.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం హిందూ సంప్రదాయ పద్దతులను క్రమంగా జనంపై రుద్దుతోందని., ఆయుర్వేదం, యోగా, ప్రకృతి వైద్యం, సిద్దవైద్యం వంటివి సంస్కృతభాషలోని హిందూ సూత్రాలపైనే ఆధారపడిన వైద్యవిధానాలని.. జయలాల్  చెప్పుకొచ్చాడు!

అంతేకాదు హిందువులను క్రైస్తవులుగా మతం మార్చేందుకు ఆసుపత్రులను మించిన కేంద్రాలు లేవని..,  వైద్యం కోసం వచ్చే హిందువులను మతం మార్చడం ఆసుపత్రుల్లో చాలా సులభమని చెప్పుకొచ్చాడు. కొవిడ్ 19… ఎంతో మంది బాధితులను క్రైస్తవులుగా మతం మార్చడానికి ఉపయోగపడుతోందని తన మనుసులోని మాటను బయటపెట్టాడు.

అలాగే ఆధునిక అల్లోపతి వైద్యం…క్రైస్తవ వైద్యవిధానమని.., ఆసుపత్రుల్లో ఎక్కువ మంది క్రైస్తవ వైద్యులే ఉండాలని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నాడు.  తాను ప్రస్తుతం మెడికల్ కాలేజీలో సర్జరీ ప్రొఫెసర్ గా ఉన్నానని..,  వైద్యవిద్యార్థులకు, ఇంటర్న్ షిప్ ఇచ్చే అవకాశం తనకు ఉందని..,  దీనిని అందుకు చక్కగా ఉపయోగించుకోగలనని కూడా చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం ఐఎంఏ అధ్యక్షుడి హోదాలో కొనసాగుతున్న డాక్టర్ జయలాల్ క్రైస్తవ మతమార్పిడి కార్యకలాపాలపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ కేంద్రప్రభుత్వానికి లేఖ రాసింది. వైద్యం కోసం వచ్చే రోగులను… క్రైస్తవులు..,  క్రైస్తవేతరులు అనే కోణంలో విభజించి…, వారిని క్రైస్తవులుగా మతం మార్చేందుకు అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని జాన్ జయలాల్ బహిరంగంగానే ప్రకటించిన విషయాలను గుర్తు చేస్తూ.., వెంటనే అతని మెడికల్ ప్రాక్టీషనర్స్ లైసెన్స్ ను రద్దు చేయాలని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తన ఫిర్యాదులో పేర్కొంది.

అంతేకాదు ఇప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్… ప్రజల ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపే అనేక బ్రాండ్లకు ఆమోద ముద్ర వేస్తోంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆమోదం పొందిన తమ బ్రాండ్లను వాడండి అంటూ ప్రకటనల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నాయ. ఆయా బ్రాండ్లపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆమోదం పొందినది అనే లోగోను ముద్రించడం కోసం కోట్లాది రూపాయలను వసూలు చేస్తోంది IMA.

వినియోగదారుల ఆరోగ్యం కంటే కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డబ్బుకు ప్రాధాన్యతనిస్తూ… పండ్ల రసాల నుంచి మొదలు పెడితే ఎల్ఈడీ బల్బ్ వరకు అన్నింటికి తమ ఆమోద ముద్ర వేస్తోంది. ఆయా ఉత్పత్తులను వాడటంతో ప్రజలకు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని మభ్యపెడుతున్నాయి. పలు కంపెనీలు మోసంతో మార్కెటింగ్ చేసుకునేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అండగా ఉంటుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇప్పటి వరకు మనం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆమోదం తెలిపన కొన్ని ఉత్పత్తుల వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రముఖ కూల్ డ్రింకులు కంపెనీ అయిన పెప్సికో..ట్రోపికానా అనే పండ్ల రసాన్ని, అలాగే అల్పహరంగా కెల్లాగ్ ఓట్స్ ను మార్కెట్ లోకి తీసుకుని వచ్చింది. దీనికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆమోదం ఉన్నట్లుగా ఈ రెండు కంపెనీలు దాని లోగోను ముద్రించడంతోపాటు.. డాక్టర్లు సైతం ఈ పూడ్ ను తినమని ప్రోత్సహిస్తున్నారంటూ యాడ్స్ ను రూపొందించి ప్రకటనలు గుప్పిస్తున్నాయి.  ప్రపంచ వ్యాప్తంగా ఈ జంక్ పూడ్స్ కు ఆమోదం తెలిపిన మొదటి అసోసియేషన్ ఐఎంఏననే విమర్శలు ఉన్నాయి.

ఏ శాస్త్రీయ పద్ధతి ప్రకారం పరీక్షలు జరిపి తాము వీటికి ఆమోదం తెలిపింది మాత్రం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇంత వరకు వెల్లడించలేదు. పైగా వీటికి ఆమోదం తెలిపినందుకు కోట్ల రూపాయలు తీసుకున్నట్లు ప్రచారం జరిగింది.

అలాగే ఎలక్ట్రిక్ వస్తువుల ఉత్పత్తి కంపెనీ క్రాంప్టన్ ఓ విచిత్రమైన యాడ్ ను రూపొందించింది. ఇళ్ల్లల్లో గోడలకు వేసే పెయింట్ పై రోగాలకు కారణమైన ఎన్నో రకాల బ్యాక్టీరియాలు ఉంటాయని…, దీనికి విరుగుడుగా యాంటీ బాక్టీరియల్ ఎల్ఈడీ బల్బ్ ను ఉపయోగిస్తే 85 శాతం వరకు రోగకారకమైన సుక్ష్మక్రిములు చనిపోతాయని ప్రకటనలు గుప్పిస్తోంది. దీనిని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సైతం ధృవీకరించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. క్రాంప్టన్ కంపెనీ రూపొందించిన గ్రీవ్స్ ఎల్ఈడీ బల్బ్  ఎండార్స్ మెంట్ వెనుక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏ శాస్త్రీయ ప్రక్రియను అనుసరించిందో సమాధానం లేదు.

ఇక వంటిపై ఉండే సుక్ష్మక్రిముల నాశక సోప్ అనగానే మనకు డెటాల్ సబ్బు గుర్తుకు వస్తుంది. దీనికి కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆమోదం తెలిపింది. ఈ డెటాల్ సబ్బుల కవర్స్ పై మనం ఐఎంఏ లోగోను స్పష్టంగా చూడవచ్చు. ఇతర బ్రాండ్ల సబ్బుల కంటే కూడా 10 శాతం ఎక్కువగా ప్రభావం చూపుతుందని.., వంటివైపై సుక్ష్మక్రిములు వాలకుండా…వ్యాప్తిచెందకుండా రక్షిస్తుందనే ప్రచారం జరుగుతోంది. దీనిని ఏ ప్రామాణిక పరీక్షలు, పద్దతులను అనుసరించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆమోదం తెలిపిందో ఎవరికి తెలియదు.!

అలాగే 2015లో కెంట్ వాటర్ ప్యూరిఫైయర్లను ఐఎంఏ ఆమోదించింది. కెంట్ వాటర్ ప్యూరిఫైయర్లను ఆమోదించడం వెనుక భారీగా ముడుపులు ముట్టాయని.. మార్కెట్ లో కెంట్ కు పోటీ కంపెనీ అయినా యురేకా ఫోర్బ్స్ విమర్శలు గుప్పించింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నైతికతను ప్రశ్నించింది. అలాగే గత ఏడాది ఏషియన్ పెయింట్స్ ఓ కొత్త వర్షన్ తీసుకువచ్చింది. ఆ వాల్ పెయింట్ ఇంట్లో వేసుకుంటే ఆరోగ్యానికి ప్రమాదం కలిగించే విషవాయులను నిర్మూలిస్తుందని.. గది అంతటిని సువాసనల మయం చేస్తుందని, ఇదో శానిటైజర్ లా పనిచేస్తుందని స్టార్ హీరోతో యాడ్ ను విడుదల చేసింది. అంతేకాదు దీనికి సైతం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆమోదం తెలిపింది.

ఇక ఈ ఉత్పత్తులే కాదు.. యురేకా ఫోర్బ్స్, డాబర్, యునిలివర్, ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ ఉత్పతలను ఆమోదించడంతోపాటు, ఆయా కంపెనీలతో  భారీ ఆర్థిక ఒప్పందాలను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేసుకుంది.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు జాన్ జయలాల్, అలాగే ఉపాధ్యక్షుడు నవజ్యోత్ దహియనేమో భారత ప్రధాని నరేంద్రమోదీని కరోనా సూపర్ స్ప్రెడర్ అంటూ ప్రకటనలు విడుదల చేస్తారు. అలాగే స్వదేశీ… ఆయుర్వేదం… ఆరోగ్యం… యోగా.., పతంజలి మందులు, ఉత్పత్తుల ద్వారా మల్టీనేషనల్ కంపెనీల ఆటకట్టించిన రాందేవ్ బాబాను సైతం ఇండియన్ అసోసియేషన్ అదేపనిగ టార్గెట్ చేస్తోంది.

ఇటు..ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేత గుర్తింపబడి ఆమోదం పొందినది అంటూ అనేక బ్రాండ్స్ తో ఆర్థిక ఒప్పందాలు చేసుకుంటోంది. ఈ ఎండార్స్ మెంట్ చేసే అధికారం ఓ ప్రైవేటు సంస్థ అయిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కు ఎక్కడిది?  ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆమోదించింది అంటూ ప్రకటనల ద్వారా వినియోగదారులైన ప్రజలను మోసం చేయడం కాదా? తాము ఆమోదం తెలిపిన ప్రొడక్ట్స్ పై ఫలానా పరీక్షలు జరిపామంటూ ఎందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆ వివరాలు బయటకు చెప్పడం లేదు? అసలు ఫార్మాకంపెనీలకు..కార్పొరేట్ కంపెనీలతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేసుకుంటున్న ఒప్పందాల వెనుక మతలబేంటి?

సిద్ధవైద్యం, ఆయుర్వేదం.. వేప పుల్ల, దంతమంజన్ పనికిరావు అని చెప్పే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అదే టూత్ పెస్టులు, సబ్బులు, కూల్ డ్రింకులు, పండ్ల రసాలు, హెల్తీ పూడ్స్ అంటూ ఏ ప్రమాణికతను.. ఏ శాస్త్రీయ పద్ధతిని అనుసరించి ఆమోదం తెలుపుతూ సర్టిఫికెట్లను జారీ చేస్తోంది.?

అసలు ప్రజలు తమ నిత్యజీవనంలో వినియోగించుకునే అనేక వస్తువులకు ఆమోదం తెలిపేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కున్న అర్హత ఏంటీ? 

ఆలోచిస్తుంటే అటు మందుల కంపెనీలు, ఇటు బహుళజాతి కంపెనీలు, మరోవైపు ఇండయన్ మెడికల్ అసోసియేషన్…అంతా కూడా ఒక మనీమేకింగ్ చైన్ సిస్టమ్ లా ఇంటర్ లింకుడుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం… ఐఎంఏ చైన్ సిస్టమ్ ఆటకట్టిస్తుందా? అలాగే ఐఎంఏ అధ్యక్షుడి పై చర్యలు తీసుకుంటుందా?

లేదంటే..అటు ఐఎంఏ అధ్యక్షుడు జాన్ రోస్ ఆస్టిన్ ఉరఫ్ జయలాల్ ను రక్షించేందుకు.., ఇటు మల్టినేషనల్ కంపెనీలను రక్షించేందుకు… లూటియెన్స్ జర్నలిస్టులు, కుహనా మేధావులు, క్రైస్తవ ఎన్జీవో సంఘాల నేతలు ఏకంగా సరికొత్త క్యాంపెయినే మొదలు పెడతారా? జస్ట్ ఆస్కింగ్.

Leave a Reply

Your email address will not be published.

13 − 7 =

Back to top button