ఇండోర్ నివాసి అయిన జై సింగ్ యాదవ్.. బాలీవుడ్ నటులు విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ నటించిన సినిమాలో తన నంబర్ ప్లేట్‌ను అక్రమంగా ఉపయోగించడంపై 1 జనవరి 2022న పోలీసులకు ఫిర్యాదు చేశారు. విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ కలిసి బైక్‌పై వెళుతున్న ఫోటోలు ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో జై సింగ్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
‘సినిమా సీక్వెన్స్‌లో ఉపయోగించిన వాహనం నంబర్ నాది.. చిత్ర యూనిట్‌కి ఇది తెలిసి ఉందో లేదో తెలియదు…ఇది చట్టవిరుద్ధం, అనుమతి లేకుండా నా నంబర్ ప్లేట్‌ని ఉపయోగించలేరు. స్టేషన్‌లో మెమోరాండం ఇచ్చాను. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలి’ అని మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. ఇండోర్‌లోని బంగంగా ప్రాంతం సబ్-ఇన్‌స్పెక్టర్ రాజేంద్ర సోనీ మాట్లాడుతూ ‘మాకు ఫిర్యాదు అందింది. అక్రమంగా నంబర్ ప్లేట్ వాడారా లేదా అనేది చూడాలి. మోటారు వాహన చట్టంలోని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం. చిత్ర యూనిట్ ఇండోర్‌లో ఉంటే వారిని విచారించేందుకు ప్రయత్నిస్తామని’ అన్నారు.
విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ కొత్త చిత్రం షూటింగ్ కోసం ఇండోర్ వీధుల్లో కనిపించారు. ఈ సినిమా పేరు ఇంకా ధృవీకరించలేదు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. బులియన్ రాజ్‌వాడ, బడా రావ్లా ఛత్రిపుర ఇతర ప్రాంతాలలో షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ సమయంలో బాలీవుడ్ తారలను చూసేందుకు అభిమానులు ప్రతిరోజూ షూటింగ్ ప్రదేశాలకు చేరుకుంటున్నారు. విక్కీ కౌశల్ ఇటీవల రాజస్థాన్‌లో కత్రినా కైఫ్‌ను వివాహం చేసుకున్నాడు. శనివారం సాయంత్రం కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకున్న తర్వాత భార్యతో కలిసి ముంబై విమానాశ్రయంలో కనిపించాడు.