More

    శివుడి చేతిలో ఆల్కహాల్ గ్లాస్ పెట్టారంటూ ఇంస్టాగ్రామ్ పై కేసు

    సోషల్ మీడియా దిగ్గజం ఇంస్టాగ్రామ్ లో సాధారణంగా స్టిక్కర్లు ఉంటాయి. అందులో పలు మతాల దేవుళ్ళకు చెందిన స్టిక్కర్స్ కూడా ఉన్నాయి. అందులో శివుడి స్టిక్కర్లు కూడా ఉన్నాయి. ఈ స్టిక్కర్లలో శివుడి చేతిలో ఆల్కహాల్ గ్లాసు ఉండడం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమవుతోంది. శివుడి కూర్చుని ఉండగా.. ఆయన ఒక చేతిలో ‘గ్లాసు’ ఉండడం.. అది ఆల్కాహాల్ ను సూచిస్తూ ఉండడంతో ఇంస్టాగ్రామ్ తీరును తప్పుబడుతూ ఉన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఈ స్టిక్కర్ ఉందని విమర్శలు మొదలయ్యాయి.

    కొన్ని కోట్ల మంది పూజించే శివుడిని ఇంస్టాగ్రామ్ నిర్వాహకులు ఇలా అమర్యాదకరంగా చూపించడాన్ని విమర్శిస్తూ ఉన్నారు. ఇది పెద్ద తప్పుదమని ఇంస్టాగ్రామ్ పై ఫిర్యాదు కూడా నమోదైంది. స్టిక్కర్స్ అనే ఆప్షన్ ను ఓపెన్ చేసి శివ అని టైపు చేయగా గ్రాఫిక్స్ ఇంటిగ్రేటెడ్ ఫార్మాట్(జిఐఎఫ్) లో శివుడి బొమ్మ కూడా ఉంది. శివుడు కన్నుకొట్టే స్టిక్కర్ ను కూడా అందులో చూడొచ్చు.

    Instagram

    ఢిల్లీలో నివసించే మనీష్ సింగ్ ఇంస్టాగ్రామ్ పై పోలీసులకు పిర్యాదు చేశారు. శివుడిని అభ్యంతరకరంగా చూపించినందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌పై ఫిర్యాదు చేశారు. శివుడిని ఒక చేతిలో మద్యంతో, మరోవైపు మొబైల్ ఫోన్‌తో చూపించే స్టిక్కర్ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందని ఫిర్యాదు దారు ఆరోపించారు. ఇలాంటి స్టిక్కర్ ద్వారా ఉద్దేశపూర్వకంగా కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని, అటువంటి స్థితిలో శివుడిని చిత్రీకరించడం ద్వారా హిందువులను మనసులను గాయపరిచారని ఇంస్టాగ్రామ్ పై ఫిర్యాదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ సీఈఓ, ఇతర అధికారులపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 153, 295 ఎ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదుదారుడు కోరారు. దీనిపై ఇంస్టాగ్రామ్ నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

    Instagram

    Trending Stories

    Related Stories