More

  పళని స్వామిని స్టాలిన్ చెప్పుతో పోల్చి దూషించిన 2జీ స్పెక్ట్రమ్ రాజా..! సెల్ఫ్ డిఫెన్స్ లో డీఎంకే!

  రాజకీయాల్లో ఉన్నప్పుడు బీకేర్ ఫుల్ గా ఉండాలి. మాట తూలితే అంతే.! అందులో ఒక్కొసారి ఆవేశంలో చేసే కామెంట్లు అనర్థాలకు దారితీస్తాయి. వైరి పక్షానికి ఆయుధంగా మారుతాయి.! అందులోనూ ఎలక్షన్ టైమ్ లో మరి కేర్ ఫుల్ గా ఉండాలి!
  ప్రస్తుతం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార, ప్రతిపక్షాలు ఎన్నికల ప్రచార సమయంలో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడం కామన్..! అయితే పదేళ్ళపాటు అధికారానికి దూరమైన డీఎంకే పార్టీ… ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలనే విశ్వప్రయత్నం చేస్తోంది. దీంతో ఆ పార్టీ నేతల నోటికి అదుపులేకుండా పోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార అన్నాడీఎంకే కూటమి నేతలను డీఎంకే నేతలు నొటికి వచ్చినట్లు దూషిస్తున్నారు.
  డీఎంకే నేత ఎంపీ ఏ రాజా..! అందరికీ 2జీ స్పెక్ట్రమ్ రాజా గా తెలుసు! ఈ కేసుల జైలుకు కూడా వెళ్లాడు.! ఆ తర్వాత సుప్రీం తీర్పుతో ఆ కేసు నుంచి బయటపడ్డాడు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం పళనిస్వామిపై, రాజా హద్దుమీరి నోటికొచ్చినట్లు దూషించారు. సీఎం పళిని స్వామి… తమ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కాలికి వేసుకున్న చెప్పు పాటి విలువ కూడా చేయరంటూ కారుకూతలు కూశాడు. ఒకప్పుడు బెల్లం మార్కెట్ లో కూలీగా పనిచేసిన పళనిస్వామికి స్టాలిన్ తో పోటీయా…? పళిని కంటే స్టాలిన్ వేసుకునే చెప్పుకు విలువ ఎక్కువ..! అలాంటిది పళినిస్వామి..! తమ పార్టీ నేత స్టాలిన్ నే సవాల్ చేసే ధైర్యం చేస్తాడా? అంటూ ఏ రాజా దూషించాడు. .

  ఎన్నికల సమయంలోరాజా చేసిన ఈ వ్యాఖ్యలు తమిళనాడు అంతటా రాజకీయ దుమారం రేపుతున్నాయి. సీఎం పళని స్వామి కూడా డీఎంకే నేత రాజా చేసిన వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్టాలిన్ లాగా తనకు రాజకీయ వారసత్వం లేదని, కరుణానిధి కుమారుడు గా ఆయన సిల్వర్ స్పూన్ తో జన్మించడాని, మా నాయన సీఎం అయ్యాడు, నేను కూడా సీఎం అవుతానంటున్నాడని.., తాను ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చానని, సీఎం పదవిని అలంకరించానని, మేమూ పేదలమని, కష్టపడి పనిచేసి సంపాదిస్తాం., మేము కొనుక్కోగలిగింది మాత్రమే కొనుగోలు చేస్తాం.! కానీ డీఎంకే పార్టీ నేతల 1.73 లక్షల కోట్ల అవినీతి కుంభకోణం వెనుక ఉన్నారు. కాబట్టి వారు కోరుకున్నది కొనుక్కుంటారు అంటూ రాజాకు, అలాగే స్టాలిన్ కు సీఎం పళిని స్వామి కౌంటర్ ఇచ్చారు.
  మరోవైపు సీఎం పళనిస్వామిపై డీఎంకే నేత రాజా చేసిన కామెంట్లపై తమిళ ప్రజలు కూడా మండిపడుతున్నారు. కొంతమందినెటిజన్లు అయితే అధికారం కోసం డీఎంకే నేతలు మరి ఇంత సంస్కార హీనంగా మాట్లాడుతారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. రాజా చేసిన కామెంట్లపై తమిళ ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తుండటంతో…డీఎంకే నేతలు డిఫెన్స్ లో పడినట్లు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అన్ని సర్వేల ఫలితాలు డీఎంకేకు అనుకూలంగా ఉన్నాయని చెబుతున్న తరుణంలో… ఆ పార్టీ నేత రాజా చేసిన లూజ్ కామెంట్ ఓటింగ్ సరళిపై ప్రభావం చూపుతుందేమోనని కొంతమంది డీఎంకే నేతలు ఆందోళన చెందుతున్నారు. పీఎం మోదీని మణిశంకర్ అయ్యార్ నీచ్… ఛాయ్ వాలా? అంటూ చేసిన కామెంట్, అలాగే 2014 ఎన్నికల సమయంలో సోనియా గాంధీ.., పీఎం మోదీని మౌత్ కా సౌదాగర్ అంటూ చేసిన కామెంట్లు ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణమైన విషయాన్ని కొంతమంది గుర్తు చేస్తున్నారు.

  Trending Stories

  Related Stories