National

అక్కడ హిందువులను రక్షించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలి

గురువారం నాడు పశ్చిమ బెంగాల్ లో రెండు వర్గాల మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. చందన్ నగర్, బల్లిగంజ్ తిల్జాలా ప్రాంతాల్లో రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది. హింస చెలరేగిన తరువాత పరిస్థితిని శాంతింపచేయడానికి పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. డీసీపీ (సౌత్‌ఈస్ట్‌ డివిజన్‌) సుదీప్‌ సర్కార్‌, ఇతర ఉన్నతాధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. శాంతిభద్రతల నియంత్రణను ఇరు వర్గాల మధ్య సమావేశం నిర్వహించినట్లు ఒక అధికారి తెలిపారు. “తిల్జాలాలో ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయి. మత పరమైన గొడవలు ఉన్నాయి. మేము శాంతి సమావేశం నిర్వహిస్తున్నాము ”అని ఒక పోలీసు అధికారి తెలిపారు.

గవర్నర్ జగదీప్ ధంఖర్ మాట్లాడుతూ, “చందన్ నగర్, తిల్జాలా ప్రాంతంలో శాంతి, ప్రశాంతతను కొనసాగించడానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్ని చర్యలు తీసుకోవాలి. కోల్‌కతా పోలీసులు, పశ్చిమ బెంగాల్ పోలీసులు, హోం మంత్రిత్వ శాఖకు సరైన సందేశం పంపాలని.. ఈ ఘటనలపై జవాబుదారీతనంతో పని చేయాలని” అన్నారు. ఓ వీడియోను కూడా జగదీప్ దంఖర్ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అందులో ఒక ఉన్మాద గుంపు ఒక పోలీసు వాహనాన్ని ధ్వంసం చేయడం గమనించవచ్చు. ఇటుకలు, కర్రలతో వాహనాన్ని ధ్వంసం చేయడం కూడా కనిపించింది. అరాచకం, అన్యాయం, హింస ప్రజాస్వామ్యానికి శత్రువులు. అస్థిర పరిస్థితిని మరింత దిగజార్చకుండా ఉండటానికి మమతా బెనర్జీ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. పక్షపాత ప్రయోజనాలకు మించి ఎదగవలసిన సమయం వచ్చిందని తెలిపారు.

ఆలయాల ధ్వంసం.. హిందువులపై దాడులు:

మంగళవారం నాడు తిల్జాలా పరిసరాల్లో ఉదయం సమయంలో ‘శని కాళి ఆలయాన్ని’ ఇస్లాం వాదులు ధ్వంసం చేశారని బిజెపి కార్యకర్త దేవదుత్తా మాజీ సమాచారాన్ని బయట పెట్టారు. విగ్రహాలను అపవిత్రం చేశారని, ఆలయ ద్వారాలు పగిలిపోయాయని ఆయన అన్నారు. గురువారం మరో ఆలయంపై దాడి జరిగిందని కూడా ఆయన చెప్పారు. హిందువులను రక్షించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని దేవదుత్తా మాజీ కోరారు. అతను పంచుకున్న ఒక వీడియోలో.. ప్రజలు రోడ్లపై నడుస్తుండగా నాటు బాంబుల పొగతో వీధి మొత్తం కప్పబడి ఉంది.

‘Hopeless Bengali Hindu’ అనే ట్విట్టర్ ఖాతాలో తిల్జాలాలోని మసీదు బారి వీధిలో ఉన్న కాశీ మందిర్ కు సంబంధించిన విజువల్స్ చూడొచ్చు. వీడియో ఫుటేజ్ ద్వారా విగ్రహాలను అపవిత్రం చేసినట్లు స్పష్టమైంది, దుండగులు బలవంతంగా గేట్ తెరిచేందుకు ప్రయత్నించారు. బుధవారం (జూన్ 9) ఈ దాడి జరిగిందని ట్విట్టర్ యూజర్ తెలిపారు. అయితే ఈ వీడియోను నేషనలిస్ట్ హబ్ ధ్రువీకరించలేదు.

జర్నలిస్టుపై దాడులు:

తిల్జాలాలో ఒక జర్నలిస్ట్ జరిగిన దాడిని బీజేపీ ఎమ్మెల్యే, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి బయట పెట్టారు. ఆయన ట్వీట్ చేస్తూ “వార్తలను కవర్ చేసే సమయంలో జర్నలిస్ట్ సంజీబ్ బసుపై దారుణంగా దాడి చేశారని.. ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను.. ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమే కాకుండా జరలిస్టులపై దాడి చేయడం తగదని” అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్ చేసిన గూండాలు తిల్జాలాలో పాల్పడ్డ హింస గురించి వార్తలను సేకరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు జర్నలిస్ట్ సంజీబ్ బసుపై దారుణంగా దాడి చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని తృణమూల్ కాంగ్రెస్ హత్య చేస్తోంది. ఈ సంఘటనను నేను తీవ్రంగా ఖండిస్తున్నానని సువేందు అధికారి తెలిపారు.

జర్నలిస్ట్ సంజీబ్ బసు మాట్లాడుతూ.. ‘తోప్సియా హజారిబాగ్ శాంతిభద్రతల పరిస్థితి గురించి మాకు సమాచారం వచ్చింది. మేము అక్కడికి చేరుకున్నప్పుడు, నేను నా సహోద్యోగిని దుండగులు దారుణంగా కొట్టారు. నా కంటికి తీవ్రంగా గాయమైంది.. అప్పుడు, కొంతమంది స్థానిక పురుషులు జోక్యం చేసుకుని మమ్మల్ని రక్షించారు’ అని చెప్పారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

thirteen − 13 =

Back to top button