వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. ప్రతి నెలా ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను సమీక్షిస్తున్న చమురు కంపెనీలు 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ రేటును రూ.91.50 మేర తగ్గించాలని నిర్ణయించాయి. తగ్గిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. తగ్గిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.2028కి చేరింది. ఇక కోల్‌కతాలో రూ.2221 నుంచి రూ.2132కు, ముంబైలో రూ.2071గా సిలిండర్ ధర రూ.1980కి, చెన్నైలో రూ.2268 నుంచి రూ.2176.5కు తగ్గింది.