More

    తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంత.. ఎవరికి..?

    వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌ ధర మరోసారి తగ్గింది. దేశీయ చమురు కంపెనీలు 19 కిలోల కమర్షియల్‌ సిలిండర్‌పై రూ.25.50 తగ్గించాయి. ఢిల్లీలో సిలిండర్‌ ధర రూ.1859కి చేరింది. హైదరాబాద్‌లో రూ.36.50 తగ్గడంతో రూ.2099.5గా ఉన్న సిలిండర్‌ రూ.2064కు పడిపోయింది. వాణిజ్య సిలిండర్‌ ధర కోల్‌కతాలో రూ.1959, ముంబైలో 1811.5, చెన్నైలో రూ.2009.5గా ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గిన ఫలితం ఇక్కడి ధరలపై ప్రభావం చూపించింది.

    ఈఏడాది గరిష్ఠస్థాయికి చేరిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు గత జులై నుంచి తగ్గుతూ వస్తున్నాయి. జులై నెలలో రూ.135, ఆగస్టులో రూ.36 మేర తగ్గిన ధర సెప్టెంబర్‌ 1న మరో రూ.91.50 మేర తగ్గింది. తాజాగా రూ.25.50 తగ్గింది. ఇక గృహావసరాలకు వినియోగించే సిలిండర్‌ ధరల్లో ఎలాంటి మార్పూ లేకపోవడం విశేషం. దేశవ్యాప్తంగా ఎల్పీజీ ధరలు ఒకే విధంగా ఉండవు. రవాణా, ఇతర పన్నులతో కలుపుకుని ధరల్లో మార్పు ఉంటుంది.

    Trending Stories

    Related Stories