ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్ జగన్ ఢిల్లీలో పర్యటించనున్నారు. గురువారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ఆయన విమానంలో బయలుదేరారు. మధ్యాహ్నం 1.45 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2.45 గంటలకు 1- జన్‌పథ్ చేరుకుంటారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్ గురువారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సీఎం జగన్ చర్చించనున్నారు. ప్రధానమంత్రిని కలిశాక పలువురు కేంద్రమంత్రులతోనూ భేటీ కానున్నారు సీఎం జగన్.
ఏపీ రుణ పరిమితిపై కేంద్రం విధించిన సీలింగ్‌ను ఎత్తివేసే అంశాన్ని చర్చించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ఆర్థికశాఖతోపాటు కాగ్ నుంచి అభ్యంతరాలు వస్తున్నందున జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రుణ పరిమితి సీలింగ్‌పై వెసులుబాటు ఇవ్వాల్సిందిగా సీఎం జగన్ కేంద్రాన్ని కోరే అవకాశం ఉంది. రాష్ట్రపతి ఎన్నికల విషయంపై కూడా ప్రధాని మోదీ సీఎం జగన్‌ల మధ్య చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.