More

  అమ్మ ఒడి డబ్బులు రావాలంటే..75 శాతం హాజరు ఉండాల్సిందే: సీఎం జగన్

  ఏపీ సీఎం జగన్ శ్రీకాకుళంలో నిర్వహించిన సభలో అమ్మ ఒడి మూడో విడత నిధులను విడుదల చేశారు. ఒక్క బటన్ క్లిక్ తో 40 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి రూ.6,595 కోట్లు జమ చేశారు. అమ్మ ఒడి పథకం కింద ఇప్పటిదాకా రూ.19,618 కోట్లు విడుదల చేశామని చెప్పారు. పిల్లలను బడికి పంపిస్తున్న ప్రతి తల్లి ఖాతాలో నగదు జమ చేస్తున్నామని, దాదాపు 80 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరుస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులతో పిల్లలు చదువు మధ్యలో ఆపకూడదని కోరుకుంటున్నామని తెలిపారు. బాగా చదవాలన్న ఉద్దేశంతోనే 75 శాతం హాజరు తప్పనిసరి చేశామని సీఎం జగన్ వివరించారు.

  43 లక్షలా 96 వేలమంది తల్లులకు, రూ. 6595 కోట్లు నేరుగా ఖాతాలలోకి వేస్తున్నామని.. మీ కుటుంబాల భవిష్యత్ ను పిల్లల చదువులలో చూసుకుంటున్న తల్లులకు , పిల్లలకు బెస్డ్ విసెస్ చెబుతున్నానని సీఎం జగన్‌ అన్నారు. కుటుంబం, దేశం తలరాతలు మార్చగలిగేది ఒక్క చదువేనని.. చదువులు ఎక్కువ ఉన్న దేశాలలో ఆదాయాలు ఎక్కువ అన్నారు. తలసరి ఆదాయం ఎక్కువ ఉండటానికి కారణం చదువు అని.. చదువే నిజమైన ఆస్తి అని చెప్పుకొచ్చారు. చదువుపై ఖర్చు చేసే ప్రతి పైసా పవిత్రమైన పెట్టుబడి అని అన్నారు. ఒకతరాన్ని , తలరాతలను మార్చే శక్తి విద్యకే ఉందని.. ప్రపంచంలో ఎక్కడికైనా వెల్లి బ్రతికే సత్తా , చదువుతోనే వస్తుందని చెప్పుకొచ్చారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా మన పిల్లల చదువులు ఒక హక్కుగా అందాలని ముందుకు వెలుతున్నామని అన్నారు.

  అమ్మ ఒడి డబ్బులు రావాలంటే..75 శాతం హాజరు ఉండాల్సిందేనని చెప్పుకొచ్చారు. ఓ వైపు చదివించాలని ఉన్న ఆర్దిక ఇబ్బందులు బాధపెడుతుంటాయని.. బడికి పంపిస్తే ప్రతి ఏటా 15000 అందిస్తున్నామని చెప్పారు. హాజరు నిభందన అమలు చేయటంతో 51 వేల వంది పిల్లలకు అమ్మ ఒడి ఇవ్వలేక పోయామని వెల్లడించారు.

  spot_img

  Trending Stories

  Related Stories