More

    ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లతో ముగిసిన సీఎం జగన్ భేటీ

    ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి భేటీ ముగిసింది. గురువారం మ‌ధ్యాహ్నం ఢిల్లీ వెళ్లిన జ‌గ‌న్‌ సాయంత్రం 4.30 గంట‌ల‌కు ప్రధాని మోదీతో స‌మావేశ‌మ‌య్యారు. దాదాపుగా 45 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన ప‌లు పెండింగ్ అంశాలపై చ‌ర్చ జ‌రిగిన‌ట్లు స‌మాచారం. మోదీతో భేటీని ముగించుకున్న జ‌గ‌న్ అటు నుంచి అటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌తో భేటీ కోసం వెళ్లారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతోనూ జ‌గ‌న్ భేటీ అయ్యే అవ‌కాశాలున్నాయి. అమిత్ షా, జ‌గ‌న్‌ల భేటీ రాత్రి 9 గంట‌ల త‌ర్వాత జ‌రిగే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది.

    ప్ర‌ధాని మోదీతో భేటీ ముగిసిన అనంత‌రం ముఖ్యమంత్రి జగన్ నేరుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధికార నివాసానికి జ‌గ‌న్ వెళ్లారు. ఆమెతో వైఎస్ జగన్ ప‌లు అంశాల‌పై జ‌గ‌న్ చ‌ర్చ‌లు జ‌రిపారు. సాయంత్రం 5.30 గంట‌ల‌కు మొదలైన‌ వీరిద్ద‌రి భేటీ కేవ‌లం 10 నిమిషాల్లోనే ముగిసింది.

    Trending Stories

    Related Stories