More

    రేపు పశ్చిమ గోదావరి జిల్లాకు సీఎం జగన్

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.50 గంటలకు నరసాపురం చేరుకుంటారు. 11.15, 12.50 వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 2.00 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.

    Trending Stories

    Related Stories