ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలు, హిందూ సంఘాల కార్యకర్తలకు రోల్ మోడల్‌గా ఉన్నారు. పాలనా పరంగా ఉత్తరప్రదేశ్ మోడల్‌ను పలువురు ప్రశంసించారు. ఇక యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామంటూ బెదిరింపులు కూడా సర్వ సాధారణమైపోయాయి. పాకిస్థాన్ లాంటి దేశాలు యోగి ఆదిత్యనాథ్ కు వ్యతిరేకంగా కుట్ర పన్నుతూ ఉన్న సంఘటన తెలిసిందే..!
తాజాగా ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆత్మప్రకాష్ పండిట్ ఫేస్‌బుక్ ఖాతాలో ప్రచురించిన ఓ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ పోస్ట్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ తల నరికేస్తానని బెదిరించాడు. విచారణలో తన ఫేస్‌బుక్ అకౌంట్ ను హ్యాక్ చేశారని.. అతడు సైబర్ స్టేషన్ పోలీసులకు సమాచారం అందించాడు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ ను చంపిన వారికి రూ.2 కోట్ల రివార్డు ఇస్తామంటూ ఫేస్ బుక్ పోస్ట్ సంచలనం సృష్టించింది. ఫేస్‌బుక్ పోస్ట్ గురించి ఓ మహిళ ట్విట్టర్ ద్వారా మొరాదాబాద్ పోలీసులకు సమాచారం అందించింది. ఈ పోస్ట్ గురించి ఆయుషి మహేశ్వరి అనే మహిళ పోలీసులకు తెలిపింది. ఆయుషి ఉత్తరప్రదేశ్‌లోని భారతీయ జనతా మజ్దూర్ సంఘ్ మహిళా సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు. ఆత్మప్రకాష్ పండిట్ అనే ఫేస్‌బుక్ యూజర్ ఖాతా నుంచి ఈ పోస్ట్ చేయబడింది. ఆయుషి ఆత్మప్రకాష్ ఖాతాను తనిఖీ చేయగా, అందులో పాకిస్థాన్ ప్రధాని ఫోటోతో పాటు పాకిస్థాన్ జెండా చిత్రం కూడా ఉంది. మహిళ ఆ పేజీ, ఖాతా స్క్రీన్‌షాట్‌ను తీసి మొరాదాబాద్ పోలీసుల ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసింది.
ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రారంభించిన హెల్ప్‌లైన్‌లో కూడా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపాలని వాట్సాప్ సందేశం రావడంతో పోలీసులు ఇటీవల ఒక వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రారంభించిన ‘డయల్-112’ హెల్ప్‌లైన్ కు వాట్సాప్ కనెక్టివిటీ కూడా ఉంది. ఈ నంబర్‌కు షాహిద్ అనే వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చింది. బాంబు పేల్చి ముఖ్యమంత్రిని చంపేస్తానని హెచ్చరించాడు. ఈ కేసుకు సంబంధించి లక్నోలోని సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నారు.