More

    బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కు అరుదైన అవకాశం

    బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కు అరుదైన అవకాశం లభించింది. కడపకు చెందిన సీఎం రమేశ్ పదేళ్లకు పైగా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్ గా ఆయనను నియమిస్తూ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో సోమవారం పార్లమెంటులో ఆయన రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తనకు కేటాయించిన కార్యాలయంలో ఆయనకు హౌస్ కమిటీ అధికారులు స్వాగతం పలికారు. హౌస్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన రమేశ్… కమిటీకి చెందిన కార్యకలాపాలపై అధికారులతో సమీక్షించారు. రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్ హోదాలో ఢిల్లీలో ఎంపీలకు సర్కారీ బంగళాల కేటాయింపు, వాటి నిర్వహణ తదితర బాధ్యతలను రమేశ్ పర్యవేక్షించనున్నారు. టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సీఎం రమేశ్, 2019 ఎన్నికల తర్వాత బీజేపీలో చేరారు.

    Trending Stories

    Related Stories