More

    ధన బలంతో మునుగోడులో గెలవాలని సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు

    ధన బలంతో మునుగోడులో గెలవాలని సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. మునుగోడులో టీఆర్ఎస్ నాయకులు ఒక్కో ఓటుకు రూ.10వేల నుంచి రూ.15వేల దాకా పంచారని.. కొన్ని మీడియా సంస్థలు మాత్రమే ఈ ధన ప్రవాహం బాగోతాన్ని బయటపెట్టాయని తెలిపారు. టీఆర్ఎస్ ఓడిపోతుందనే డిప్రెషన్ లో కేసీఆర్ ఉన్నాడని.. అందుకే రోజూ పోలీసులకు ఆదేశాలు ఇస్తున్నారన్నారు. ఎన్నికల కమిషన్ పై ఒత్తిడి తీసుకొస్తున్నాడని.. బండి సంజయ్ అరెస్టు వార్తకు కవరేజీ ఇవ్వొద్దని మీడియాపై కూడా కేసీఆర్ ఒత్తిడి చేశాడని ఆరోపించారు. ‘స్వయంగా ముఖ్యమంత్రే రౌడీయిజం చేయండి.. గూండాయిజం చేయండి అని టీఆర్ఎస్ నేతలకు చెబుతున్నాడని.. అందుకే బీజేపీ కార్యకర్తలపై, నాయకులపై దాడులు జరిగాయని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో నాన్ లోకల్ టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారనే దానిపై పోలీసులకు బీజేపీ కార్యకర్తలు సమాచారమిస్తే.. వెంటనే వాళ్లు టీఆర్ఎస్ లీడర్లకు ఫోన్ చేసి సమాచారాన్ని లీక్ చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. మా కార్యకర్తలను కాపాడుకోవడానికి హైదరాబాద్ నుంచి బయలుదేరి మునుగోడుకు వస్తే అనేక ప్రాంతాల్లో నన్ను అడ్డుకుని.. చివరకు అరెస్టు చేశారని అన్నారు. మీడియా , పోలీసులు, ఎన్నికల కమిషన్ సీఎం చేతిలో ఉన్నాయని.. ఎన్నికల కమిషన్ మీద ప్రజలకు నమ్మకం లేకుండాపోయిందని అన్నారు.

    Trending Stories

    Related Stories