మునుగోడు ఉప ఎన్నికకు పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. నవంబర్ 1న ప్రచార పర్వం ముగియనుంది. నవంబర్ 3న పోలింగ్ జరుగుతుంది. పార్టీల నేతలు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ప్రతి గడపకు వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. ఇప్పటి వరకు ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ కు తిరిగి రాగా.. ఇకపై మునుగోడు ఉప ఎన్నికపై దృష్టి సారించబోతున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించబోతున్నారు. మూడు రోజుల పాటు ఆయన అక్కడే ఉండనున్నారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లో మునుగోడు నియోజకవర్గంలో కేసీఆర్ పర్యటించనున్నారు. నియోజకవర్గంలో ఆయన రోడ్ షోలు నిర్వహించబోతున్నారు. 31న భారీ బహిరంగసభలో ప్రసంగించనున్నారు.